'సీఎంలు ఇద్దరూ అమావాస్య చంద్రులు'

16 Jul, 2015 09:28 IST|Sakshi

ధర్మపురి (కరీంనగర్): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ అమావాస్య చంద్రులని ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కిగౌడ్ ఆరోపించారు. గురువారం ఆయన కరీంనగర్ జిల్లా ధర్మపురిలో పుష్కరస్నానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియతో మాట్లాడుతూ.. పుష్కరాలకు మొక్కుబడి ఏర్పాట్లతో మమా అనిపించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అమావాస్య చంద్రులు పాలిస్తుండటంతో వరుణుడు ముఖం చాటేశాడని విమర్శించారు. రాజమండ్రి సంఘటనకు ఏపీ సీఎం చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని మధుయాష్కి గౌడ్ కోరారు.

మరిన్ని వార్తలు