వర్గీకరణపై నివేదికలను అమలు చేయాలి

19 Feb, 2017 02:50 IST|Sakshi

హైకోర్టులో మాదిగ సంఘాల పిటిషన్‌

సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ వర్గీకరణ నిమిత్తం జస్టిస్‌ ఉషా మెహ్రా నేతృత్వంలోని జాతీయ ఎస్సీ కమిషన్‌ 2008లో ఇచ్చిన నివేదికను, 1999లో జస్టిస్‌ రామచంద్రరాజు కమిషన్‌ నివేదికలను అమలు చేసేలా కేంద్రంతోపాటు, ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

బీసీ వర్గీకరణ చేసి ఎస్సీ వర్గీకరణ చేయకపోవడం వివక్ష చూపడమే నంటూ మాదిగ హక్కుల పరిరక్షణ సేవా సమిటీ సం యుక్త కార్యదర్శి రాయవరపు చిరంజీవరావు, మాదిగ రిజర్వేషన్‌ సా«ధన సమితి అధ్యక్షుడు వల్లూరు వెంకటేశ్వ రరావులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

మరిన్ని వార్తలు