అభివృద్ధిని జీర్ణించుకోలేకే..

1 Jun, 2018 09:22 IST|Sakshi
 టీఆర్‌ఎస్‌లో చేరిన వివిధ పార్టీల నాయకులు

పెబ్బేరు : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి కాంగ్రెస్‌ నాయకులు జీర్ణించుకోలేకే విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో సాయిరాం ఫంక్షన్‌హాల్‌లో కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో తెలంగాణ దేశానికి మార్గదర్శకం అవుతుందన్నారు. సీఎం కేసీఆర్‌ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ పథకాలను పథకాలను అమలుచేస్తున్నారని కొనియాడారు. నాలుగేళ్లలో 24 గంటల ఉచిత కరెంట్, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, రైతుబంధు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, రుణమాఫీ.. ఇలా ఎన్నో పథకాలను అమలుచేసినట్లు తెలిపారు. తనకు పదవులు లేకున్నా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు.

అభివృద్ధి పనులను చూసి ప్రజలకు ఎక్కడికి వెళ్లినా సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. అంతకుముందు బీజేపీ, టీడీపీ నాయకులు భానుప్రకాష్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, శేఖర్‌గౌడ్, వార్డు సభ్యులు కుమ్మరి అచ్చన్న, మురళిరెడ్డి, సంజీవరెడ్డి, వెంకటేష్, సాయిరెడ్డి, ప్రపుల్‌నాయుడు, ఆంజనేయులుతో పాటు సుమారు 100 మందిని పార్టీలోకి ఆహ్వానించి కండువా వేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ప్రకాష్, ఎంపీపీ పద్మావతి, గౌని బుచ్చారెడ్డి, విశ్వరూపం, హరిశంకర్‌నాయుడు, గోవింద్‌నాయుడు, ఎంపీటీసీ సభ్యుడు ఐజాక్, శివశంకర్‌గౌడ్, ఎండీ ముస్తాక్, రామన్‌గౌడ్, గోపాల్‌ యాదవ్, అక్కమ్మ వేణుగోపాల్, బీచుపల్లి పాల్గొన్నారు.

కల్యాణలక్ష్మి చెక్కు పంపిణీ 

వనపర్తి: మండలంలోని అంకూరు గ్రామానికి చెందిన బీసమ్మకు రూ.51 వేలు, భాగ్యమ్మకు రూ.51 వేలు, అనసూయమ్మకు రూ.75,116 కల్యాణలక్ష్మీ చెక్కులను గురువారం సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వనపర్తిలోని తన నివాసంలో పంపిణీ చేశారు.   పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామానికి చెందిన నారాయణకు రూ.25వేల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పలుస రమేష్‌గౌడ్, కౌన్సిలర్‌ గట్టుయాదవ్, టీఆర్‌ఎస్‌ నాయకులు యోగానందారెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు