టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకే మహాకూటమి: షబ్బీర్‌అలీ 

3 Dec, 2018 17:11 IST|Sakshi
దేవునిపల్లిలో షబ్బీర్‌అలీకి పూలవర్షంతో స్వాగతం      

బంగారు తెలంగాణతో ఆ కుటుంబానికే లబ్ధి

 కేసీఆర్‌ ఓటమి ఖాయం 

సాక్షి, కామారెడ్డి రూరల్‌: టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకే మహాకూటమి ఏర్పడిందని కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌అలీ అన్నారు. ఆదివారం మండలంలోని దేవునిపల్లిలో ఎన్నికల ప్రచారం చేశారు. డప్పు, డోలు వాయిద్యాలు, వాడవాడల పూలవర్షంతో ఘన స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ నాలుగున్నరేళ్ల పాలనలో కేసీఆర్‌ కుటుంబానికి, ఎమ్మెల్యేలకే బంగారు తెలంగాణ అయిందని, ప్రజలకు మాత్రం ఒరింగేదేమి లేదన్నారు. బీడీ పరిశ్రమపై 28 శాతం జీఎస్టీ తొలగిస్తామన్నారు.

జెడ్పీటీసీ నిమ్మమోహన్‌రెడ్డి, మండల అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్‌రెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ఉరుదొండ నరేష్, మాజీ సర్పంచ్‌లు ఉరుదొండ రాజయ్య, బండారి యాదవరెడ్డి, ఎంపీ టీసీ నిమ్మ విజయ్‌కుమార్‌రెడ్డి, భూమని బాల్‌రాజు, చెట్కూరి గంగారాం, నీలం సుధాకర్, నీలం వెంకటి, నాగల్ల రాజయ్య, మర్కంటి స్వామి, నాగరాజు, కిరణ్‌కుమార్, నౌసిన్, మిద్దెలసాయిలు, బాలస్వామి, దొడ్లె మల్లేష్, గంగారాజ్యం, ప్రభాకర్, భైరయ్య, అరీఫ్, సాకలి శ్రీను, సాకలి నర్సింలు పాల్గొన్నారు.   

గెలిస్తే కామారెడ్డి ప్రజలకు సేవచేస్తా 

దోమకొండ: తనను గెలిపిస్తే కామారెడ్డి ప్రజలకు సేవ చేస్తానని కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి షబ్బీర్‌అలీ అన్నారు. ఆదివారం రాత్రి ఆయన దోమకొండలో విజయశాంతితో కలిసి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తాము గెలిస్తే తిరిగి ఇందిరమ్మ రాజ్యం తీసుకువస్తామన్నారు. పేద ప్రజలకు తినడానికి రేషన్‌ ద్వారా తొమ్మిది రకాల సరుకులు, ఏడాదికి ఆరు సిలిండర్లు అందిస్తామని ఆయన వివరించారు. ఇళ్లు లేని పేదలకు ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు అందిస్తామన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి అందించి ఏడాదికి లక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. పార్టీ నాయకులు తిర్మల్‌గౌడ్, నల్లపు శ్రీను, మర్రిలింగం, అనంతరెడ్డి ఉన్నారు. 

ఓటమి భయంతో కుట్రలు చేస్తున్నారు 

సాక్షి, కామారెడ్డి: నియోజకవర్గంలో ప్రజల్లో తనకు వస్తున్న ఆదరణను చూసి ఓడిపోతామన్న భయం పట్టుకుని రకరకాల కుట్రలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా తన గెలుపును అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. దేవునిపల్లిలో ప్రచారం నిర్వహించిన షబ్బీర్‌అలీ, బీబీపేట, దోమకొండల్లో సినీనటి విజయశాంతితో కలిసి రోడ్‌షోలో పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు.  

కాంగ్రెస్‌లో చేరిన ఇసన్నపల్లివాసులు  

భిక్కనూరు: మండలంలోని ఇసన్నపల్లి గ్రామానికి చెందిన ప లువురు యువకులు కాంగ్రెస్‌ పార్టీలో ఆదివారం చేరారు. శాస న మండలి విపక్షనేత షబ్బీర్‌అలీ వీరికి పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు. పీసీసీ కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి, నాయకులు గుడిసె రాములు, వడ్ల తిర్మల్‌స్వామి, రాజేష్, రమేశ్‌ ఉన్నారు.

మరిన్ని వార్తలు