'టీఆర్ఎస్ భవన్ జోలికి వస్తే టీడీపీ కార్యాలయాలుండవు'

22 Oct, 2014 17:56 IST|Sakshi

హైదరాబాద్: టీడీపీ తమ పార్టీ జోలికి వస్తే తీవ్ర పరిణామాలు తప్పవని టీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి హెచ్చరించారు. టీఆర్ఎస్ భవన్ జోలికి వస్తే టీడీపీ కార్యాలయాలు లేకుండా చేస్తామని అన్నారు.

టీడీపీ వైఖరి మారకపోతే నల్లగొండ తరహా దాడులు జరుగుతాయని మహేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండలో జరిగిన దాడిలో రైతులు, ప్రజలే పాల్గొన్నారని చెప్పారు.

మరిన్ని వార్తలు