బ్యాంకు అకౌంట్లను ఎలా సీజ్‌ చేస్తారు..? : మహేష్‌

28 Dec, 2018 18:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పన్ను బకాయిలు చెల్లించనందుకు టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబుకు బ్యాంకు ఖాతాలను జీఎస్టీ అధికారులు జప్తు చేశారు. ఈ వ్యవహారంపై మహేష్‌బాబు లీగల్‌ టీమ్‌ ఎట్టకేలకు స్పందించింది. వివాదం కోర్టు పరిధిలో ఉండగా బ్యాంకు ఖాతాలను ఎలా సీజ్‌ చేస్తారంటూ, చట్టానికి కట్టుబడే పౌరునిగా మహేష్‌ బాబు తన పన్నులన్నింటిని సక్రమంగా చెల్లించారంటూ ఓ ప్రెస్‌నోట్‌ను రిలీజ్‌ చేసింది.

‘2007-08 ఆర్థిక సంవత్సరానికి గానూ అంబాసిడర్‌ సర్వీసెస్‌కు ఈ పన్ను చెల్లించాలని జీఎస్టీ అధికారులు ఆదేశించారు. వాస్తవానికి ఆ కాలంలో అంబాసిడర్‌ సర్వీసెస్‌ ఎటువంటి ట్యాక్స్‌ పరిధిలోకి రాదు. అంబాసిడర్‌ సర్వీసెస్‌ ఎటువంటి ట్యాక్స్‌ పరిధిలోకి రాదు. ఈ ట్యాక్స్‌ను సెక్షన్‌ 65 (105)(zzzzq) ద్వారా 2010 జులై 1నుంచి చేర్చడం జరిగింది. టాక్స్‌ పేయర్‌ చట్టపరమైన అన్ని నియమాలకు లోబడే ఉన్నా, ఎటువంటి నోటీసు లేకుండా, పైగా ఈ విషయం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ జీఎస్టీ కమిషనరేట్‌ బ్యాంకు అకౌంట్ల నిలుపుదలకు ఆదేశించిడం జరిగింది. మహేష్‌ బాబు తన పనులన్నింటిని సక్రమంగానే చెల్లించారు’ అంటూ మహేష్‌ బాబు లీగల్‌ టీమ్‌ పత్రికా ప్రకటన విడుదల చేసింది. 

మరిన్ని వార్తలు