వారికి ఢిల్లీలోనే అంటిందా?

30 Mar, 2020 03:17 IST|Sakshi

కరోనా బాధితుల్లో అధికశాతం ఢిల్లీలో మతకార్యక్రమానికి వెళ్లినవారే

వెళ్లిన వారి సంఖ్యపై  ఇంకా రాని స్పష్టత

అంతా రైల్లోనే తిరుగు ప్రయాణం..సెల్ఫ్‌ క్వారంటైన్‌పై అనాసక్తి

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ మత ప్రచార కార్యక్రమం తెలుగు రాష్ట్రాల ప్రజల్లో కలకలం రేపుతోంది. ఢిల్లీలో జరిగిన ఆ మత ప్రచార కార్యక్రమానికి వెళ్లి వచ్చిన వారిలో చాలామందికి ఇప్పుడు కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కరోనా కారణం గా ఓ వృద్ధుడు (74) మరణించాడు. అతడు కూడా ఢిల్లీలో జరిగిన మత కార్యక్రమానికి హాజరయ్యాడని తెలియడం నగరవాసుల్లో ఆందోళనకు కా రణమవుతోంది. కుత్బుల్లాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి కూడా అదే వేడుక కు వెళ్లి వచ్చి కరోనా లక్షణాలతో గాంధీలో చేరాడు. అతని నలుగురు కుటుంబ సభ్యులకు, పాతబస్తీలో ఒకే కుటుంబంలో ఆరుగురికి కరో నా పాజిటివ్‌ వచ్చింది. వీరంతా ఢిల్లీలో జరిగిన మత కార్యక్రమానికి హాజరైనవారే. అదే కార్యక్రమానికి వెళ్లివచ్చిన నిజామాబాద్‌లోని ఖిల్లా ప్రాంతానికి చెందిన వ్యక్తికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఈ అనుమానాలకు మరింత బలమిచ్చింది. సదరు వేడుకకు వెళ్లిన పలువురు ఏపీ పౌరులకూ కరోనా పాజిటివ్‌ అని తేలడం గమనార్హం.

వారంతా పాజిటివే..!
ఢిల్లీలో జరిగిన మత ప్రచార కార్యక్రమానికి ఇం డోనేసియా నుంచి వచ్చిన మతబోధకులు హాజ రయ్యారు. వారందరిలోనూ అప్పటికే కరోనా లక్షణాలు ఉన్నాయి. అలా ఆ కార్యక్రమానికి వెళ్లి న వారికీ వైరస్‌ సంక్రమించి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇదే బృందానికి చెందిన కొంద రు ఇండోనేసియన్లు తెలంగాణ, తమిళనాడు రా ష్ట్రాల్లో పర్యటించారు. వారందరిలోనూ కరోనా పాజిటివ్‌ లక్షణాలు ఉండటంతో వారి ద్వారా స్థానికులకూ వ్యాపించింది. ఇండోనేసియాకు చెందిన పదిమందిS బృందం కరీంనగర్‌లో పర్యటించడం ఎంత కలకలానికి కారణమైందో తె లిసిందే. అలాగే తమిళనాడులోనూ వీరు పర్యటించడం అక్కడ కూడా కరోనా అలజడికి కారణమైంది.

రైల్లోనే తెలుగు రాష్ట్రాలకు..
ఢిల్లీలో జరిగిన సదరు కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 1,500 నుంచి 2,000 వరకు హాజరైనట్లు సమాచారం. కార్యక్రమం అనంతరం కొందరు విమానాల్లో, అధికశాతం రైల్లోనే తెలుగు రాష్ట్రాలకు వచ్చారు. ఇప్పటికే వారిలో కొన్ని కుటుంబాలు కరోనా బారినపడ్డాయి. ఆ కుటుంబాలతో సఖ్యతగా ఉన్న వారు కూడా ఇప్పుడు తమలో ఏ క్షణాన వ్యాధి లక్షణాలు బయటపడతాయోనని భయపడుతున్నారు. మరోవైపు రైలు ప్రయాణం చేసిన కోవిడ్‌ బాధితుల ద్వారా ఆ వ్యాధి వారికి తెలియకుండానే ఎంతమందికి వ్యాపించి ఉంటుందో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఢిల్లీకి వెళ్లి వచ్చినవారి లెక్క తేలితే గానీ ఈ విషయంలో ఒక స్పష్టతకు రావడం కష్టమంటున్నారు అధికారులు.

మరిన్ని వార్తలు