అధ్యక్షా..!

16 Nov, 2017 12:34 IST|Sakshi
ప్రతిపక్షాల ప్రశ్నలపై ఆర్థికశాఖ మంత్రి హోదాలో సమాధానం ఇస్తున్న విద్యార్థి

జెడ్పీహెచ్‌ఎస్‌లో మాక్‌ ‘అసెంబ్లీ’ విజయవంతం

నాగర్‌కర్నూల్‌ ఎడ్యుకేషన్‌: అధ్యక్షా.. అంటూ పిల్లలు అదరగొట్టారు. అచ్చం ముఖ్యమంత్రిలా.. మంత్రుల్లా.. ప్రతిపక్ష హోదాల్లో ప్రశ్నించే ఎమ్మెల్యేల్లా వారివారి పాత్రలను చక్కగా పోషించి నిజంగా అసెంబ్లీ ఇలా సాగితే బాగుండే.. అన్నట్లు వ్యవహరించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది. మాక్‌ అసెంబ్లీలో విద్యార్థుల చర్చలు.. ప్రశ్నలు.. జవాబులను చూసి జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారిణి ప్రజ్వల, ఆర్డీఓ శ్రీనివాసులు, జీసీడీఓ వరలక్ష్మి ఇతర అధికారులు అవాక్కయ్యారు. 

                ఇరుపక్షాలను సముదాయిస్తున్న స్పీకర్‌  పాత్రధారి

మరిన్ని వార్తలు