జూపార్క్‌లో మగ సింహం మృతి

2 Jul, 2018 10:23 IST|Sakshi
మృతి చెందిన క్రేజీ ( ఫైల్‌)

బహదూర్‌పురా: నెహ్రూ జూపార్కులో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మరో సింహం మృతి చెందింది. క్రేజీ అనే మగ సింహాం(15) మే 19 నుంచి అనారోగ్యానికి గురైంది. రక్తహీనత, తలకు గాయాలు, మూత్రంలో రక్తం వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న క్రేజీకి జూ పార్కు వైద్యసిబ్బంది చికిత్స అందజేస్తున్నారు.

గత నెల 28న ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పాటు వైద్యానికి స్పందించకపోవడంతో అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు మృతి చెందింది. జూ కన్సల్టెంట్‌ డాక్టర్‌ నవీన్‌కుమార్, అసిస్టెంట్‌ డైరెక్టర్లు డాక్టర్‌ దేవేందర్‌రావు, డాక్టర్‌ జీ.సునీత, డాక్టర్‌ సుహ్రుద, సీసీఎంబీ సీనియర్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ సాంబశివరావు, డాక్టర్‌ ఎం.ఏ.హకీం తదితరులు గత 29న పోస్టుమార్టం నిర్వహించారు. క్రేజీ శరీరం నుంచి మరిన్ని నమూనాలను సేకరించి వీబీఆర్‌ఐ ల్యాబ్‌కు తరలించినట్లు జూపార్కు క్యూరేటర్‌ శివానీ డోగ్రా తెలిపారు.

మరిన్ని వార్తలు