స్ట్రాంగ్‌ ఉమెన్‌ ఆఫ్‌ తెలంగాణగా ‘మల్లికా యాదవ్‌’

25 Jul, 2018 12:48 IST|Sakshi
స్ట్రాంగ్‌ ఉమెన్‌ ఆఫ్‌ తెలంగాణ టైటిల్‌ను అందుకుంటున్న మల్లిక  

సూపర్‌బజార్‌(కొత్తగూడెం) : కొత్తగూడెం పట్టణంలోని నేతాజీ వ్యాయామశాలకు చెందిన వి.మల్లికాయాదవ్‌ రాష్ట్రస్థాయి సీనియర్‌ పవర్‌లిఫ్టింగ్‌ పోటీల్లో బంగారుపతకం సాధించడంతోపాటు స్ట్రాంగ్‌ ఉమెన్‌ ఆఫ్‌ తెలంగాణ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్‌ ఇండోర్‌ స్టేడియంలో తెలంగాణ రాష్ట్రస్థాయి సీనియర్‌ పవర్‌లిఫ్టింగ్‌ పోటీలు జరిగాయి.

ఈ పోటీల్లో మల్లికాయాదవ్‌ బ్యాక్‌స్కాడ్‌ విభాగంలో 180 కేజీలు, బెంచ్‌ప్రెస్‌లో 80, డెడ్‌లిఫ్ట్‌లో 180 కేజీల బరువులు ఎత్తి బంగారు పతకంతోపాటు టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆగస్టులో గుంటూరు జిల్లా మదనపల్లిలో జరగనున్న సీనియర్‌ జాతీయస్థాయి పవర్‌లిఫ్టింగ్‌ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది.

ఈ సందర్భంగా మల్లికకు ఉమ్మడి జిల్లా పవర్‌లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ చీఫ్‌ ప్యాట్రన్‌ డాక్టర్‌ ఎ.నాగరాజు, జిల్లా బాడీబిల్డింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కె.వసంతరావు, ప్రధాన కార్యదర్శి మామిడి శ్రీనివాస్, జిల్లా వెయిట్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ కూచన కృష్ణారావు, జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కె.మహిదర్, కిక్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఖాసీ హుస్సేన్, కె.మొగిళిలు అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు