జీవితంపై విరక్తి చెంది యువకుడి బలవన్మరణం 

30 Jun, 2019 12:53 IST|Sakshi

సాక్షి, బాన్సువాడ: మండలంలోని సోమేశ్వర్‌ గ్రామానికి చెందిన ఒడ్డెర శ్రీకాంత్‌(24) అనే యువకుడు జీవతంపై విరక్తి చెంది ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు బాన్సువాడ సీఐ మహేష్‌గౌడ్‌ తెలిపారు. గతేడాది శ్రీకాంత్‌కు వివాహం జరిగిందని సరిగ్గా చూసుకోవడం లేదని భార్య  కేసు పెట్టిందన్నారు. బాన్సువాడ కోర్టులో కేసు కొనసాగుతుండగా పలుమార్లు కాపురానికి రావాలని కోరినా భార్య రాకపోడంతో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మృతుడి తండ్రి రామయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు.  

మరిన్ని వార్తలు