సిటీలో మండుతున్న ఎండలు.. వ్యక్తి మృతి!

1 May, 2018 13:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో సూర్యుడు భగ్గుమంటున్నాడు. గతకొంతకాలంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడంతో నగరంలో ఎండలు మండుతున్నాయి. దీంతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయట అడుగుపెట్టేందుకు నగరవాసులు భయపడుతున్నారు. ఒకవేళ అత్యవసర పరిస్థితులు ఉండి బయటకు వస్తున్నవారు.. మండుతున్న ఎండలకు తాళలేక అవస్థలు పడుతున్నారు.

మరోవైపు నగరంలోని కూకట్‌పల్లిలో ఎండదెబ్బకు ఓ వ్యక్తి మరణించాడు. వడదెబ్బకు కుప్పకూలిన అతని వివరాలు తెలియరాలేదు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని.. మృతుడు వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు