పొట్టకూటి కోసం వచ్చి.. మృత్యుఒడికి

13 Aug, 2015 03:05 IST|Sakshi

 చేవెళ్ల : పొట్టకూటి కోసం వచ్చిన ఓ యువకుడు కరెంట్‌షాక్‌కు గురై మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని న్యాలట గ్రామ శివారులోని పొలాల్లో బుధవారం చోటుచేసుకుంది. పోలీసు లు, ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం.. మండల పరిధిలోనపలు గ్రామాల వ్యవసాయ పొలాలకు ఇప్పటికే ఉన్న 100 కేవీ, 63 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లను తొలగించి వాటి స్థానంలో 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లను ట్రాన్స్‌కో అధికారులు ఏర్పాటుచేస్తున్నారు. ఈ పనులను ఐదారు నెలలుగా కాంట్రాక్టర్ పశ్చిమబంగ, బిహార్ రాష్ట్రాల నుంచి కార్మికులను (స్కిల్డ్ లేబర్)ను తీసుకొచ్చి పనులు చేయిస్తున్నాడు.

ఈక్రమంలో బుధవారం ఓ సూపర్‌వైజర్, లైన్‌మెన్ ఎల్‌సీ తీసుకొని కార్మికులు షఫీక్(20), సయ్యద్, ఆఫ్రిదీ, అక్తర్‌తో మండల పరిధిలోని న్యాలట శివారులో పనులు చేయిస్తున్నారు. కార్మికులు స్తంభాలు ఎక్కి ఏబీ స్విచ్‌లు బిగించడం, మరమ్మతులు చేస్తుం డగా అకస్మాత్తుగా విద్యుదాఘాతానికి గురైన షఫీక్ స్తంభంపైనే మృతిచెం దాడు. స్థంభంపైన ఉన్న మరో కార్మికుడు సయ్యద్ కిందికి దూకగా అతనికి గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. కరెంట్ షాక్ తగలగానే షఫీక్ కిందికి దూకే యత్నం చేశాడు. అతడు స్తంభానికి ఉన్న రాడ్‌ల మధ్య ఇరుక్కుపోవడంతో తీవ్రషాక్ గురై అక్కడికక్కడే మృతిచెందాడు.

కొద్దిసేపటి తర్వాత విద్యుత్ కాంట్రాక్టర్ అక్కడికి చేరుకొని స్తంభంపై వేలాడుతున్న మృతదేహాన్ని కిందికి దించారు.  మృతుడు పశ్చిమబంగ రాష్ట్రంలోని మోల్దా జిల్లాలోని కుమినరా గ్రామానికి చెందిన వాడు. కార్మికుడి మృతి విషయం తెలుసుకున్న ఎస్‌ఐ విజయకుమార్, ఏఎస్‌ఐ హన్మంత్‌రెడ్డిలు  వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబీకులకు సమాచారం అప్పగించారు. కాగా, తీవ్రమైన మేఘాలు కమ్ముకోవడం, వాతావరణం మబ్బుగా ఉండడంతో సమీపంలో ఉన్న 220 కేవీ విద్యుత్ లైను క్రాసింగ్‌ల నుంచి వచ్చే ఇండక్షన్స్‌తో మరమ్మతులు చేస్తున్న లైను కు విద్యుత్ సరఫరా జరిగి షఫీక్‌కు షాక్ తగిలి ఉండొ చ్చని  కాంట్రాక్టరు తెలిపాడు. కేసు దర్యాప్తులో ఉంది.

మరిన్ని వార్తలు