వేములవాడలో దారుణం..

19 Sep, 2017 16:16 IST|Sakshi
వేములవాడలో దారుణం..

సాక్షి, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దారుణం చోటుచేసుకుంది.  ఓ వ్యక్తి తన భార్యను నడిరోడ్డు మీద గొంతు కోసి హతమార్చాడు. అనంతరం తాను కూడా గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికంగా ఈ ఘటన సంచలనం రేపింది.

జగిత్యాల జిల్లా నర్సింగాపూర్‌ గ్రామానికి చెందిన బాలరాజు(30), వసంత(25) భార్యాభర్తలు. వసంత పుట్టినిల్లు వేములవాడ. వీరికి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. వేములవాడలో మంగళవారం బాలరాజు హఠాత్తుగా భార్యపై దాడి చేశాడు. ఆమె గొంతుకోసి  దారుణంగా హతమార్చాడు. అనంతరం బాలరాజు సైతం గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని పోలీసులు జీపులో సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమై ఉంటాయని స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.