పోలీసునంటూ రూ.10 లక్షల దోపిడీ

6 Oct, 2015 17:59 IST|Sakshi

నాచారం (హైదరాబాద్) : బ్యాంక్ నుంచి రూ.10 లక్షలు డ్రా చేసుకుని తీసుకువెళుతున్న ఓ వ్యక్తిని తాను లోకల్ పోలీస్‌నంటూ ఓ వ్యక్తి అడ్డగించి ఆ నగదుతో పరారయ్యాడు. ఈ ఘటన నగరంలోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం కొలుటూరుకు చెందిన రైతు మల్లారెడ్డి (65)... మంగళవారం ఉదయం శామీర్‌పేటలోని సెంట్రల్ బ్యాంకు నుంచి రూ.10 లక్షలు డ్రా చేసుకున్నాడు.

అనంతరం నాచారం హెచ్‌ఎంటీ కాలనీలోని తన స్నేహితుడిని కలిసేందుకు బైక్‌పై వెళుతున్నాడు. హబ్సిగూడ దాటిన తర్వాత ఓ వ్యక్తి మల్లారెడ్డిని ఆపాడు. తాను స్థానిక పోలీస్‌నని, బండి కాగితాలు చూపించాలని కోరాడు. దీంతో మల్లారెడ్డి బండిలో ఉన్న కాగితాలను చూపించే పనిలో ఉండగా నగదు బ్యాగుతో ఆ నకిలీ పోలీస్ పరారయ్యాడు. మల్లారెడ్డి లబోదిబోమంటూ నాచారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

మరిన్ని వార్తలు