కరీంనగర్ లో వ్యక్తి ఆత్మహత్య

2 Sep, 2015 10:20 IST|Sakshi

కరీంనగర్: కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం తిప్పాపూర్ శివారులోని ఓ రియల్‌ వెంచర్‌లో మంగళవారం రాత్రి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంచర్‌లో ఉన్న ఓ చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. బుధవారం ఉదయం చెట్టుకు వేలాడుతూ ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చనిపోయిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనేది పోలీసు విచారణలో తేలాల్సి ఉంది.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు