మొక్కజొన్న చేనులో లైంగిక దాడి?

5 Nov, 2019 09:49 IST|Sakshi
సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న సీపీ

మాదాపూర్‌లో వివాహిత హత్య

సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీపీ

గన్నేరువరం(మానకొండూర్‌): నమ్మిన స్నేహితుడి భార్యను దారుణ హత్య చేసిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని మాదా పూర్‌ గ్రామంలో వివాహిత ఎల్లాల లచ్చవ్వ(45) మొక్కజొన్న చేనులో దారుణహత్యకు గురైంది. సంఘటన స్థలాన్ని సీపీ కమలాసన్‌రెడ్డి పరిశీలించా రు. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం మేరకు..సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామానికి ఎల్లాల లచ్చిరెడ్డి, చెక్కిల శ్రీనివాస్‌గౌడ్‌ మధ్య కొద్ది కాలంగా స్నేహంగా ఉంటున్నారు. మాదాపూర్‌ శివా రులో భార్య ఎల్లాల లచ్చవ్వ తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లింది. లచ్చిరెడ్డి రైతుకాగా, చెక్కిల శ్రీని వాస్‌గౌడ్‌  ్రౖడైవర్‌గా పని చేస్తున్నాడు. ఇద్దరు కలిసి గ్రా మంలో ఒక బెల్టుషాపులో మద్యం తాగారు. లచ్చిరెడ్డి భార్య బావి వద్ద ఉండగా చెక్కిల శ్రీనివాస్‌గౌడ్‌కు బైక్‌ ఇచ్చి ఆమెను తీసుకురావాలని చెప్పాడు. అక్కడికి వెళ్లిన అతడు తన తండ్రి చెక్కిల స్వామికి ఫోన్‌ చేశా డు.

ఎల్లాల లచ్చవ్వ మొక్కజొన్న చేనులో చనిపోయి ఉందని తెలిపాడు. అతడు గ్రామస్తులకు సమాచారం అందించాడు. గ్రామస్తులు లచ్చిరెడ్డికి సమాచారం ఇచ్చి బావి వద్దకు వెళ్లారు. గాలింపు చేపట్టగా లచ్చవ్వ చేనులో వివస్త్రగా మృతిచెంది ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా గన్నేరువరం, బెజ్జంకి మండలాల ఎస్సైలు వంశీకృష్ణ, కృష్ణారెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు సిద్దిపేట జిల్లా బేగంపేట గ్రామ శివారులో చెక్కిల శ్రీనివాస్‌గౌడ్‌ను పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సీపీ కమలాసన్‌రెడ్డి, కరీంనగర్‌ రూరల్‌ ఏసీపీ విజయసారధి, తిమ్మాపూర్‌ సర్కిల్‌ సీఐ మహేశ్‌గౌడ్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితుడి వివరాలు, అతడితో ఇంకా ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించి కేసుపై సమగ్ర విచారణ చేపట్టాలని ఏసీపీని సీపీ ఆదేశించారు. 

మొక్కజొన్న చేనులో లైంగిక దాడి?
లచ్చవ్వ భర్త లచ్చిరెడ్డి, చెక్కిల శ్రీనివాస్‌గౌడ్‌ ఇద్దరు మద్యం తాగారు. మద్యం మత్తులోనే శ్రీనివాస్‌గౌడ్‌ లచ్చవ్వను తీసుకురావడానికి బైక్‌పై బావి వద్దకు వెళ్లాడు. అదేమత్తులో లచ్చవ్వను మొక్కజొన్న చేనులోకి లాక్కెళ్లి లైంగికదాడి చేసి హత్యచేసినట్లు తెలుస్తోంది. నిందితుడి నుంచి తప్పించుకునేందుకు లచ్చవ్వ ప్రయత్నించగా బలవంతంగా వివస్త్రను చేసి లైంగిక దాడి చేసే క్రమంలో ఇద్దరి మధ్య తీవ్రపెనుగులాట జరిగినట్లు సంఘటన ప్రదేశాన్ని బట్టి తెలుస్తోంది.

ఈ విషయం బయటకు తెలుస్తుందనే భయంతో లచ్చవ్వను హత్యచేసి పారిపోయేందుకు ప్రయత్నించాడని స్థానికులు తెలిపారు. అనంతరం తన తండ్రికి ఫోన్‌చేసి విషయాన్ని తప్పుదోవ పట్టించేలా లచ్చవ్వ చనిపోయిందని తెలిపాడని, అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించాడని తెలుస్తోంది. మొదటగా మండలంలోని మాదాపూర్‌ గ్రామ వైపు వెళ్లగా తరువాత బెజ్జంకి మండలం బేగంపేట వైపు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మృతురాలి ముఖం, మెడపై తీవ్రమైన గాయాలయ్యాయి. 

నిందితుడిని కఠినంగా శిక్షించాలి
శ్రీనివాస్‌గౌడ్‌ను కఠినంగా శిక్షించాలని లచ్చవ్వ భర్త లచ్చిరెడ్డి సీపీకి మొరపెట్టుకున్నాడు. ఏసీపీతో సమగ్ర విచారణ చేపట్టి నిందితుడు చెక్కిల శ్రీనివాస్‌గౌడ్‌కు కఠిన శిక్ష పడేలా కేసు నమోదు చేస్తామని సీపీ హామీ ఇచ్చారు. లచ్చిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా