కిషన్ రెడ్డి సభలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

27 May, 2015 19:40 IST|Sakshi
కిషన్ రెడ్డి సభలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతుండగా నిండు సభలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. నల్లగొండకు సమీపంలోని కేశరాజుపల్లికి చెందిన శంకర్ అనే వ్యక్తి.. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. కేంద్రంలో బీజేపీ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సభలో.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడటం ప్రారంభించిన కొద్ది సేపటికే జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది.


కాంగ్రెస్ పార్టీకి చెందిన శంకర్.. తమ గ్రామంలోని ఓ సమస్య విషయమై కిషన్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చేందుకు సభకు వచ్చాడు. అయితే, అప్పటికే ఆయన ప్రసంగం ప్రారంభం కావడంతో.. ఇప్పుడు కాదంటూ బీజేపీ కార్యకర్తలు అతడికి అనుమతి ఇవ్వలేదు. దాంతో.. తన విజ్ఞప్తిని తీసుకోలేదన్న మనస్తాపంతో.. వెంటనే తాను తెచ్చుకున్న కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే అతడిని నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటన మొత్తం రెండు నిమిషాల్లోనే జరిగిపోయింది. శంకర్ను ఆస్పత్రికి తరలించిన కొద్ది సేపటికే సభ మళ్లీ ప్రారంభమైంది.

మరిన్ని వార్తలు