నాగార్జున సాగర్‌ డ్యామ్‌ వద్ద విషాదం

12 Aug, 2019 16:57 IST|Sakshi

సాక్షి, నల్గొండ : నాగార్జుసాగర్‌ డ్యామ్‌ వద్ద సోమవారం విషాదం చోటు చేసుకుంది. సాగర్‌ పర్యటనకు వచ్చిన ఓ వ్యక్తి నీటిలో గల్లంతయ్యాడు. సాగర్‌ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో జలకళ సంతరించుకోవడంతో అధికారులు ప్రాజెక్టు గెట్లు తెరిచి.. నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో ఆ దృశ్యాలను చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు సాగర్‌ బాట పట్టారు. అయితే సాగర్‌ దిగువన శివాలయం ఘాట్‌ వద్ద కొందరు వ్యక్తులు ఈతకు దిగారు. అందులో ఓ వ్యక్తి నీటి ప్రవాహంలో చిక్కుకుపోయాడు. చాలా సేపు ఒడ్డుకు చేరేందుకు తీవ్రంగా యత్నించాడు. అయితే  పై నుంచి ప్రవాహం అధికంగా ఉండటంతో అతను నీటి ఉధృతికి  కొట్టుకుపోయాడు. పక్కన ఉన్నవారు కూడా చేసేది ఏమీ లేక ఉండిపోయారు. గల్లంతైన వ్యక్తిని జహీరాబాద్‌కు చెందిన నరసింహం(41)గా గుర్తించారు. అయితే ప్రమాదం జరగక ముందు నరసింహం తన స్నేహితులతో సరదాగా  కలిసి ప్రాజెక్టు పరిసరాల్లో ఫొటోలు దిగారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘గోవుల మృతి వెనుక కుట్రకోణం’

కరీంనగర్‌లో 'అతడు' సీన్‌ రిపీట్‌

అత్తివరదరాజు స్వామిని దర్శించుకున్న కేసీఆర్‌

కాళేశ్వరం ప్రాజెక్టులో మరో ఘట్టం 

తాళం వేసిన ఐదిళ్లల్లో చోరీ

పంద్రాగస్టుకైనా అందేనా?

తరలిపోయిన వజ్ర బస్సులు

మాటలతోనే మభ్యపెడుతున్నారు..

మళ్లీ బడికి..

సిద్దిపేట.. ఆలయాల ఖిల్లా   

కమలం గూటికి మోత్కుపల్లి?

భర్త ఇంటిముందు భార్య దీక్ష

ఇదిగో బహుమతి..  

ఏళ్లుగా.. ఎదురుచూపులే

కృష్ణా ఉగ్రరూపం.. సాగర్‌ గేట్ల ఎత్తివేత

ఏం జరుగుతోంది..?

సాహో.. బాహుబలి

జలపాతం.. జరభద్రం

హెల్మెట్‌ మస్ట్‌

పౌచ్‌ మార్చి పరారవుతారు

పుట్టినరోజే మృత్యువాత 

'కస్టమ్స్‌'.. తీర్చేయాప్‌

అక్టోబర్‌లో ‘ఓటర్ల’ సవరణ 

‘బాహుబలి’ ఐదో మోటార్‌ వెట్‌రన్‌ సక్సెస్‌

ఐఐటీ మేటి!

బలగం కోసం కమలం పావులు 

సాగర్‌ @202 టీఎంసీలు

రెండు పంటలకు ఢోకా లేనట్లే!

సందర్శకుల సందడి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

13 ఏళ్ల తర్వాత విజయశాంతి తొలిసారిగా..

ఇస్మార్ట్‌ డైరెక్షన్‌లో విజయ్‌ దేవరకొండ

తూనీగ డిజిట‌ల్ డైలాగ్‌ విడుదల

క్షమాపణ చెప్పిన మమ్ముట్టి

డిఫెన్స్‌ ఇష్టముండదు.. కొడితే సిక్సరే!

బర్త్‌డే రోజూ షూటింగ్‌లో బిజీబిజీ..