కేంద్రంపై పోరాటం చేయాలి

4 Jun, 2018 08:31 IST|Sakshi
మాట్లాడుతున్న మంద కృష్ణమాదిగ

కొత్తగూడ(ములుగు): దళిత, గిరిజనులు ఏకమై కేంద్రంపై పోరాటం చేయాలని ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు.  ఆదివారం రాత్రి మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో  జరిగిన  సింహగర్జన సన్నాహక సదస్సులో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని నేడు హరిస్తున్నారన్నారు. రిజర్వేషన్లకు అణుగునంగా భద్రత, స్వేచ్ఛగా జీవించే హక్కులు కల్పించారన్నారు.  దళిత, గిరిజనులు చదువువుకు దూరం చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు.  అందులో భాగంగానే ప్రైవేట్‌ విద్యాసంస్థలను ప్రోత్సహించడం జరిగిందన్నారు.  దళిత, గిరిజనులపై అత్యాచారా లు జరుగుతున్నా పట్టించుకునే వారు లేరన్నారు.

అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చేందుకు సుప్రీం కోర్టును అగ్రవర్ణాలు ఉపయోగించుకున్నాయన్నారు. రక్షణ కవచం లాంటి చట్ట రక్షణకు దళిత, గిరిజనులు ఏకమై ఉద్యమించాలని సూచించారు. ఈనెల 10 తలపెట్టిన సింహ గర్జనకు తరలి రావాలన్నారు.  మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, జెన్‌కో భూపాలపల్లి జిల్లా ఎస్‌ఈ జనగం నరేష్, నర్సంపేట డీఈ విజయ్, తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్, బూర్క యాదగిరి, సీపీఐ(ఎంఎల్‌), న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు బూర్క వెంకటయ్య, శ్రీశైలం ఎమ్మార్పీస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి గుగ్గిళ్ల పీరయ్య, మిడుతపల్లి యాకయ్య,  వజ్జ సారయ్య,రేణుక, వివిధ సంఘాల నాయకులు బాబూరావు, నర్స య్య, ప్రేమ్‌సాగర్, రాజం సారంగం, కల్తి ఎల్లయ్య, గుమ్మడి లక్ష్మినారాయణ, కంగాల లచ్చయ్య, చెన్నూరి మహేందర్, విజయ్, గంగిరెడ్లు, బుడిగ జంగాల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అట్రాసిటీ చట్టం కవచం లాంటిది
మరిపెడ:  అట్రాసిటీ చట్టం ఎస్సీ, ఎస్టీలకు ఒక కవచంలాంటిది ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు.  మరిపెడ లోని కనకదుర్గ  ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం ఎల్‌హెచ్‌పీఎస్‌ నియోజక వర్గ ఇన్‌చార్జి భూక్యా రామ్మూర్తినాయక్‌ అధ్యక్షతన సింహగర్జన  సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా  పాల్గొని మంద కృష్ణ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలను అణగదొక్కేందుకు కేంద్ర ప్రభుత్వ కుట్ర  చేస్తోందని ఆరోపించారు. బానిస బతుకుల నుంచి  విముక్తి కావాలంటే  దళిత, గిరిజనులు తరలిరావాలన్నారు. 1989లో ఎస్సీ, ఎస్టీ  అట్రాసి టీ యాక్ట్‌ చట్టాన్ని రూపొందించారన్నారు. ఈనెల 10న వరంగల్‌లో జరిగే దళిత, గిరిజన  సింహగర్జన సభను విజయవంతం చేయాలని కోరారు.  సమావేశంలో హలావత్‌ శంకర్‌ నాయక్, రామన్ననాయక్, అల్వాల వీరయ్య, బానాల రాజన్న, చెన్నయ్య, కనకయ్య, లక్ష్మి, భీమానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు