స్థిరాస్తి రిజిస్ట్రేషన్‌కు రూట్‌మ్యాప్‌ తప్పనిసరి

7 Apr, 2017 02:57 IST|Sakshi
స్థిరాస్తి రిజిస్ట్రేషన్‌కు రూట్‌మ్యాప్‌ తప్పనిసరి

ఆదాయానికి గండిపడే మార్గాలపై రిజిస్ట్రేషన్ల శాఖ దృష్టి

సాక్షి, హైదరాబాద్‌: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అడ్డూఅదుపు లేకుండా జరుగుతున్న అక్రమాలకు కళ్లెం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్కారు ఆదేశాల మేరకు ఆదా యానికి గండిపడే మార్గాలపై రిజిస్ట్రేషన్ల శాఖ దృష్టి పెట్టింది. క్షేత్రస్థాయిలో నిబంధనల ఉల్లంఘనలకు సబ్‌రిజిస్ట్రార్లనే పూర్తి బాధ్యులుగా పరిగణించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో స్థిరాస్తి రిజి స్ట్రేషన్‌కు సదరు ఆస్తి ఉన్న ప్రదేశం రూట్‌మ్యాప్‌ను తప్పనిసరిగా సమర్పించాలని శాఖ నిబంధన పెట్టింది.

అలాగే, రిజిస్ట్రేషన్‌ చేయా ల్సిన స్థిరాస్తి భవనం అయితే, తప్పనిసరిగా ముందువైపు నుంచి ఫొటోను తీసి దస్తావేజుకు జత చేయాలి. కొత్త నిబంధనల ద్వారా రిజిస్ట్రేషన్‌ అయిన స్థిరాస్తిని ఆడిట్‌ అధికారులు తనిఖీ చేసేందుకు వీలువుతుందని, దస్తావేజులో పేర్కొన్న భవన విస్తీర్ణాన్ని ఉద్దేశపూర్వకంగా తక్కువగా చూపేందుకు వీలుకాదని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ తరహా నిబంధనలను పాటించకుండా తక్కువ మొత్తంలో స్టాంపు డ్యూటీతో రిజిస్ట్రేషన్‌ చేస్తే సదరు సబ్‌ రిజిస్ట్రార్లనే బాధ్యులుగా పరిగణించాలని నిర్ణయించారు.

వ్యవస్థను నీరుగార్చవద్దు...
రిజిస్ట్రేషన్‌ సేవల నిమిత్తం ఫీజు, స్టాంప్‌డ్యూటీలను వసూలు చేయడం కూడా పన్నుల చట్టం కిందకే వస్తుందని, ఈ నేపథ్యంలో శాఖాపరంగా ఎటువంటి లోపాలకు గానీ, వ్యవస్థను పలుచన చేసేందుకు అధికారులు తావివ్వరాదని రిజిస్ట్రేషన్ల శాఖ స్పష్టం చేసిం ది. ఈ మేరకు తొలుత హైదరాబాద్, హైదరాబాద్‌ సౌత్‌ జిల్లాల్లో ఆడిట్‌ బృందాలు తనిఖీలు నిర్వహించి, 45 రోజుల్లోగా బకాయిలన్నింటినీ క్లియర్‌ చేసేందుకు కృషి చేయాలని, భవిష్యత్తులో అన్ని జిల్లాల్లోనూ పురోగతిని సాధించే విధంగా పనిచేయాలని ఉన్నతాధికారులు సూచించారు.

మరిన్ని వార్తలు