వదలలేం సు‘మండీ’

27 Jul, 2018 10:53 IST|Sakshi

మటన్, చికెన్, ఫిష్‌ వెరైటీలు

లొట్టలు వేస్తున్న నగరవాసులు

‘మండీ’ పేరుతో రెస్టారెంట్‌లు, కేఫ్‌లు

ధర రూ.250 నుంచి రూ.600   

సాక్షి, హైదరాబాద్‌(సిటీబ్యూరో): మండీ.. ఈ పేరు వింటేనే నగరవాసులు లొట్టలు వేస్తుంటారు. ఈ వంటకం సిటీజనులకు అత్యంత ప్రీతిపాత్రమైనది. పాతబస్తీ కేంద్రంగా విస్తరించిన క్రేజ్‌.. ఇటీవలి కాలంలో మరింత పుంజుకుంది. మటన్‌లో సహజసిద్ధంగా ఉత్పతన్నమయ్యే ద్రవాలు లేదా జ్యూసెస్‌తోటే బిర్యానీ రైస్‌ అన్నం ఉడకడం ద్వారా దీనికో ప్రత్యేకమైన రుచి, పరిమళం అబ్బుతుంది. అందుకే దీని రుచి చూసినవారు ఆ రుచిని ఇక దేనితోనూ పోల్చలేరు. ఒకేసారి కనీసం ఇద్దరు నుంచి అరడజను మంది దాకా తినేందుకు అవకాశం ఉండడం దీనిలో మరో విశేషం.

మటన్, చికెన్, ఫిష్‌ మూడు వెరైటీల్లోనూ మండీ సర్వ్‌ చేస్తున్నారు. నవతరానికి కూడా బాగా దగ్గరైన ఈ వంటకం... ఓల్డ్‌సిటీలోని బార్కస్‌లో పుట్టి... బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్‌ తదితర ప్రాంతాలన్నింట్లోని రెస్టారెంట్లు దీనికి ప్రత్యేకంగా మెనూలో స్థానం కల్పించక తప్పని పరిస్థితి తెచ్చింది. ఇక పూర్తిగా మండీ పేరు మీదే ఏర్పాటవుతున్న రెస్టారెంట్లు, కేఫ్‌లకు కూడా నగరంలో కొదవలేదు. దీని ధర రూ.250 నుంచి రూ.600 దాకా ఉంటుంది. కొన్ని చోట్ల వెరైటీని బట్టి ఇంకా ఎక్కువ కూడా చెల్లించాలి.

మండీకి పేరొందిన కొన్ని రెస్టారెంట్లు:
గచ్చిబౌలి, మాదాపూర్‌లోని ఎమ్‌ఎమ్‌ ట్రీ, ఫైవ్‌ 6, మండీ ఎట్‌ 36, హిమాయత్‌నగర్‌లో మండిలీషియస్‌. 

మరిన్ని వార్తలు