మాడ పగులుతోంది..

18 Jul, 2015 00:40 IST|Sakshi

గొంతు ఎండుతోంది
దంచికొడుతున్న ఎండలు
తారుమారైన పరిస్థితులు అక్కరకు రాని ఏర్పాట్లు
ఒక ఘాట్ మూసివేత.. మరో ఘాట్‌కు బస్సులు కరువు
మంగపేటలో పుణ్యస్నానాలకు కిలోమీటర్ మేర కాలినడక
మహా పుష్కరాల్లో భక్తులకు తప్పని పాట్లు

 
హన్మకొండ : జిల్లాలో గోదావరి పుష్కర ఏర్పాట్ల కోసం వివిధ ప్రభుత్వ విభాగాలు దాదాపు రూ.35 కోట్లు వ్యయం చేశాయి. మారిన పరిస్థితులతో ఇంకొన్ని నిధులు వెచ్చించాల్సి ఉన్నా సంశయంలో పడింది. ఫలితంగా నిలువ నీడలేక, తాగేందుకు మంచినీరు లభించక, చివరకు మహిళలు దుస్తులు మార్చుకునేందుకు సరిపడా సౌకర్యాలు లేక భక్తులు నానాపాట్లు పడుతున్నారు.
 
రామ.. రామ..
 రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద స్నానఘట్టాలు, దుస్తు లు మార్చుకునేందుకు షెడ్లు, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ తదితర ఏర్పాట్ల కోసం రూ.1.4 కోట్లు ఖర్చు చేశారు. సుమారు 700 మంది సిబ్బంది భక్తుల సేవలో నిమగ్నమయ్యూరు. అరుుతే, భక్తులు పుష్కర స్నానాలు ఆచరించే ప్రాంతంలో అవసరమైన ఏర్పాట్లు చేయలేదు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి నీటి నిల్వలు ఉన్న ప్రాంతంలో భక్తులు స్నానం చేసి వస్తున్నారు. ఇలా వెళ్లే వారి కోసం ఇసుక బస్తాలతో దారి ఏర్పాటు చేశారు. నాలుగు షామియానాలు నిర్మించినా ఇతర ఏర్పాట్లేవీ చేయలేదు. వీటిలో రెండు గాలిధాటికి కూలిపోరుు రెండురోజులైనా ఎవరూ పట్టించుకోవడంలేదు. ఉదయం 10-సాయంత్రం 5గంటల వరకు సుమారు 35 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. మరోవైపు ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు భక్తులు లేక ఖాళీగా దర్శనమిస్త్తున్నాయి.

 ‘ముళ్ల’కట్ట ఘాట్
 రూ.4.5 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ముల్లకట్టఘాట్ భక్తుల పాలిట శాపంగా మారింది. కొత్తవంతెనపై నుంచి వాహనాల రాకపోకలు నిషేధించడంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర కాలినకన వెళ్లి ఖమ్మం జిల్లాలోని అవతలివైపు గోదావరి ఒడ్డున భక్తులు పుష్కర స్నానాలు చేస్తున్నారు. పేరుకే ఖమ్మం జిల్లా అయినా.. వరంగల్ జిల్లా భక్తులే అధిక సంఖ్యలో అక్కడ పుణ్యస్నానాలు చేస్తున్నారు. అక్కడ కనీస సౌకర్యాలే చేపట్టకపోగా.. అటుగా వెళ్లొద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
 
ఏర్పాట్లు ఇక్కడ.. స్నానాలు అక్కడ..
 ముల్లకట్ట పుష్కరఘాట్‌కు వెళ్లొద్దని అధికారులు చెబుతు న్నా.. రామన్నగూడెం వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు రద్దు చేశా రు. దీంతో భక్తులు మంగపేట పుష్కరఘాట్‌కు చేరుకుంటున్నారు. శుక్రవారం మంగపేట ఘాట్‌లో అంచనాకు మించి వచ్చిన భక్తులను తరలించేందుకు కేవలం పది మినీ బస్సు లు, మేజిక్ వాహనాలు సమకూర్చారు. వాహనాల కోసం నిరీక్షించలేక చాలామంది మూడు కిలోమీటర్ల ఎండలో కా లినడకన నదిలోకి వెళ్లి పుష్కర స్ననాలు చేశారు.
 
 

>
మరిన్ని వార్తలు