మారిన ఎమ్మెల్సీ పోలింగ్ తేదీ

24 Feb, 2015 21:40 IST|Sakshi

హైదరాబాద్ : తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ తేదీని మారుస్తున్నట్లు ఈసీ ప్రకటించారు. ఇంటర్ పరీక్షల నేపథ్యంలో పోలింగ్ తేదీని మార్చి 22కు మార్చారు. అలాగే మార్చి 25న ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుందని ఈసీ తెలిపారు.  అయితే అభ్యర్థుల ధాఖలు చేసే నామినేషన్ గడువు ఈ నెల 26తో ముగియనుందని పేర్కొంది.

అసలు అయితే తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 16న పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. అయితే ఇంటర్మీడియట్ పరీక్షలు 16 నుంచి ప్రారంభమవుతున్నాయని తెలంగాణ ప్రభుత్వం ఈసీ దృష్టికి తీసుకువెళ్లాయి. దాంతో ఎన్నికల నిర్వహణ తేదీ 15గా నిర్ణయించింది. పరీక్షల నేపథ్యంలో ఉపాధ్యాయులు బిజీగా ఉంటారని దాంతో ఎన్నికల తేదీని 22కు ఖరారు చేసింది.

మరిన్ని వార్తలు