అత్యున్నత సంస్థగా తీర్చిదిద్దుతా: మారెడ్డి

19 Jan, 2019 03:15 IST|Sakshi

పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ తనపై ఉం చిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పౌరసరఫరాల సంస్థను అత్యున్నత సంస్థగా తీర్చిదిద్దుతా నని ఆ సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నా రు. శుక్రవారం సివిల్‌ సప్లయ్స్‌ భవన్‌లో సంస్థ చైర్మన్‌గా శ్రీనివాస్‌రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. మారెడ్డి మాట్లాడుతూ సంస్థ, రైతు సమస్యలపై క్షేత్రస్థాయిలో అవగాహన ఉందని, సిద్దిపేట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా ప్రత్యక్షంగా రైతుల వెతలను పరిశీలించానని తెలిపారు. రైతు ప్రయోజనాలే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని, దానికి అనుగుణంగానే మా కార్పొరేషన్‌ ముందుకెళ్తుందన్నారు.

పౌరసరఫరాల విభాగం ప్రభుత్వానికి చాలా కీలకమైందని, ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టుల వల్ల రాబోయే రోజుల్లో అదనంగా లక్షలాది ఎకరాలు సాగులోకి వస్తుందన్నారు. రాబోయే రోజుల్లో ధాన్యం దిగుబడులు భారీగా పెరగనున్న నేపథ్యంలో రైతులకు కనీస మద్దతు ధర లభించేలా, కోటి టన్నులకు పైగా ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకుంటామన్నారు.

కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌ సభర్వాల్, హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జదగీశ్‌రెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు నాయిని నరసింహారెడ్డి, కర్నె ప్రభాకర్, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ బాలమల్లు, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో పాటు పలువురు శాసనసభ, శాసనమండలి సభ్యులు, కార్పొరేషన్‌ చైర్మన్లు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు