అడవి నుంచి తప్పించుకొని క్యాంపులో ప్రత్యక్షమైంది

16 Aug, 2019 10:21 IST|Sakshi

సాక్షి, బాన్సువాడ : మండలంలోని కోటయ్య క్యాంపులో భయాందోళనకు గురి చేస్తున్న మర్నాగి(అడవి జంతువు)ని గురువారం బంధించారు. వివరాలు ఇలా ఉన్నాయి. అటవీ ప్రాంతం నుంచి తప్పిపోయిన నాలుగు మర్నాగిలు క్యాంపులో గత వారం రోజులుగా తిరుగుతున్నాయి. ఇళ్లలో చొరబడి పండ్లు, కూరగాయాలు ఎత్తుకెళుతున్నాయి. బంధించేందుకు యత్నించిన స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. గురువారం ఓ ఇంటిపైకి ఎక్కి దిగుతుండగా వాన కురువకుండా కప్పిన పట్టాలో చిక్కుకున్నాయి. దీన్ని గుర్తించిన స్థానికులు అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. అటవీ సిబ్బంది ఇద్దరు వచ్చి మర్నాగిని బంధించే క్రమంలో ఒకరికి గాయాలయ్యాయి. ఎట్టకేలకు మర్నాగిని బంధించి మల్లారం అటవీప్రాంతంలో విడిచి పెట్టారు. మిగిలిన వాటిని కూడా బంధించి తీసుకెళ్లాలని స్థానికులు కోరుతున్నారు.     

మరిన్ని వార్తలు