పేదింటి పెళ్లి కానుక ఇక రూ.1,00116 

12 Jan, 2018 20:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది బడ్జెట్‌లో మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ళకు ప్రస్తుతం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని పెంచాలని నిర్ణయించింది. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్‌ పేరుతో ప్రభుత్వం నాలుగేళ్లుగా ఈ పథకాలను అమలు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీలకు చెందిన నిరుపేద కుటుంబాల్లో ఆడ పిల్లలకు పెళ్లి కానుకగా ప్రస్తుతం రూ.75,116 ఆర్థిక సాయం అందిస్తోంది. త్వరలోనే ఈ సాయాన్ని రూ.లక్షకు పెంచబోతోంది. వచ్చే బడ్జెట్‌లో అందుకు తగినన్ని నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. సంక్రాతి పండుగ తర్వాత అధికారికంగా ఈ ప్రకటన చేసే అవకాశాలున్నట్లు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. 

>
మరిన్ని వార్తలు