డిగ్రీ తర్వాత ఇంటర్‌ పూర్తి..!

26 Oct, 2019 07:41 IST|Sakshi

లా సీటు కోసం వివాహిత న్యాయపోరాటం 

సీటు ఇవ్వాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి మూడేళ్ల డిగ్రీ చేసిన విద్యార్థి నికి లా కోర్సులో అడ్మిషన్‌ కల్పించాలని, అయితే ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ చేసిన వారికి న్యాయవిద్య చదివేందుకు అర్హత ఉందో లేదో తాము వెలువరించే తుది ఉత్తర్వులకు లోబడి అడ్మిషన్‌ ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని దోమలగూడలో ఉండే పి.సరిత పదోతరగతి చదివారు.

పెళ్లి అయ్యాక ఓపెన్‌ వర్సిటీ నుంచి డిగ్రీ చేశారు. తర్వాత లాసెట్‌కు దరఖాస్తు చేసుకుంటే ఆమె ఇంటర్మీడియట్‌ పూర్తి చేయలేదని లాసెట్‌ కన్వీనర్‌ తోసిపుచ్చారు. దీంతో ఇంటర్మీడియట్‌ కూడా చదివి లాసెట్‌ రాసి లా అడ్మిషన్‌ కోసం కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. మూడేళ్ల డిగ్రీ చేశాక ఇంటర్‌ పూర్తి చేశారనే కారణంతో అధికారులు ఆమెకు అనుమతి ఇవ్వలేదు. దీంతో సరిత హైకోర్టును ఆశ్రయించడంతో పైవిధంగా ఉత్తర్వులు వెలువడ్డాయి.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు