ప్రియాంక హత్య కేసు.. ఊహించని మలుపు

11 Aug, 2018 12:38 IST|Sakshi
ప్రియాంక తమ్ముడు, తల్లి

సాక్షి, నల్లగొండ : పద్నాలుగేళ్ల క్రితం జరిగిన మర్రిగుడ మహిళ హత్యకేసు చివరికి ఊహించని మలుపు తిరిగింది. ప్రేమ వివాహం చేసుకుని ఇంటి నుంచి పారిపోయిన తన అక్క కోసం ఓ తమ్ముడు చేసిన ప్రయత్నం చివరికి ఫలించింది. మర్రిగుడకి చెందిన హనుమంతు అనే వ్యక్తి నార్కట్‌పల్లికి చెందిన ప్రియాంకను 2004లో ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరిద్దరు వివాహం చేసుకున్నట్లు ప్రియాంక ఇంట్లోవారికి తెలియదు. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత కుటుంబంలో కలహాలు రావడంతో హనుమంతు భార్యా, పిల్లలను హత్య చేసి, మరో మహిళతో వివాహ సంబంధం పెట్టుకున్నట్లు గతంలో వెల్లడైంది.

గత నాలుగేళ్లుగా తన అక్క కోసం గాలిస్తున్న ప్రియాంక సోదరుడు ఉపేందర్‌కి ఎట్టకేలకు హనుమంతు అచూకి లభించింది. దీనితో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్ట్‌ చేశారు. శుక్రవారం పోలీసుల విచారణలో భార్య, పిల్లల్ని హత్య చేశానని తెలిపాడు. అతని వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన పోలీసులు కేసును మరింత లోతుగా విచారించారు. తాజా విచారణలో పిల్లలు  క్షేమంగా ఉన్నట్లు తెలిసింది. బాబు రాంచరణ్‌ను బంధువుల వద్ద ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారి హాలియాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నట్లు గుర్తించారు. 


 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు