శభాష్‌.. మహేష్‌

28 Feb, 2019 06:29 IST|Sakshi
నుదుటితో టైల్స్‌ పగులగొడుతున్న మహేష్‌

9.35 నిమిషాలలో నుదుటితో 1000 టైల్స్‌ పగులకొట్టిన యువకుడు

యాప్రాల్‌: కృషి, పట్టుదల ఉండి లక్ష్యాన్ని ఏర్పరచుకొని కృషి చేస్తే ఎంచుకున్న రంగంలో అద్బుతాలు సుష్టించవచ్చని నిరూపించాడో యువకుడు.బుధవారం యాప్రాల్‌ ప్రగతి ఉన్నత పాఠశాల ఆవరణలో ఒకినవ మార్షల్‌ ఆర్ట్స్‌ కరాటే అకాడమి ఆద్వర్యంలో ఇంటర్నేషనల్‌ వండర్‌ బక్‌ ఆఫ్‌ రికార్డ్‌ పోటీలు నిర్వహించారు.  వండర్‌ బక్‌ ఆప్‌ రికార్డ్స్, జీనియస్‌ బక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ఇండియా కో ఆర్డినేటర్‌ బింగి నాగెందర్‌గౌడ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా పోలో రమేష్‌ బ్లాక్‌ బెల్ట్, పాఠశాలలో ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  9.35 నిమిషాలలో 1000 టైల్స్‌పే తన నుదిటితో పగులగొట్టి  ఇంటర్నేషన్‌ వండర్‌ బక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో  స్థానం దక్కించుకున్నాడు. ఈ రికార్డ్స్‌ 16 నిమిషాలలో చేయాల్సి ఉండగా రమేష్‌ కేవలం 9 నిమిషాల 35 సెకన్లలోనే సాధించాడు. చీఫ్‌ జడ్జి బింగి నాగెందర్‌గౌడ్, పాఠశాల కరస్పాండెంట్‌ శ్రీనువాసురెడ్డి, ఒకనవ మా ర్షల్‌ ఆర్ట్స్‌ కరాటే మాస్టర్‌ కిషోర్‌కుమార్, నాగెందర్, సమక్షంలో వండర్‌ బక్‌ ఆప్‌ రికార్డ్స్‌ పతకం, సర్టిఫికట్‌ అందుకున్నాడు.

మరిన్ని వార్తలు