కదంతొక్కిన ఆర్టీసీ కార్మికులు

11 Oct, 2019 03:08 IST|Sakshi
గురువారం వరంగల్‌లో మహిళా కార్మికులు, పోలీసుల మధ్య తోపులాట

వరంగల్‌లో భారీ నిరసన ర్యాలీ

అడ్డుకునే క్రమంలో పోలీసుల అత్యుత్సాహం

మహిళా కార్మికులపై అనుచిత ప్రవర్తన

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: వరంగల్‌లో గురువారం జేఏసీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు హన్మకొండ బస్టాండ్‌ నుంచి అమరవీరుల స్తూపం వరకు నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. కార్మికులను అడ్డుకునే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మహిళా కండక్టర్లపై అనుచితంగా ప్రవర్తించారు. కాళోజీ కళాక్షేత్రం, బాల సముద్రం, ఏకశిల పార్కు వద్ద పోలీసులు ర్యాలీని నిలువరించి చెదరగొట్టే యత్నించగా కార్మికులు ప్రతిఘటించారు. ర్యాలీ నిర్వహించుకోవడానికి తమకు అనుమతి ఉందని ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను నిలదీ శారు.  ఈ నేపథ్యంలో తోపులాట జరిగింది.

అంతా మగ పోలీసులే.. 
ర్యాలీలో పాల్గొన్న మహిళా కార్మికులను మగ పోలీసులు చెదరగొట్టే యత్నం చేయగా కొంత మంది మహిళా కార్మికులకు గాయాలయ్యాయి. ఉమ, రజిత, సుజాతలను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించడం ఏంటని నిలదీయగా.. లైట్‌ తీసుకోండని కాజీపే ట ఏసీపీ నర్సింగరావు చెప్పడంతో వారు కోపోద్రిక్తులయ్యారు. ఏసీపీ తీరుపై మహిళా సంఘాలు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, 11 మం ది ఆర్టీసీ కార్మికులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మరో 26 మందిని ముందస్తుగా అరెస్టు చేసి, సొంత పూచికత్తుపై విడుదల చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కన్నీరుకూ కరోనా భయమే..! 

ప్రాణం తీసిన కరోనా కంచె 

నేటి ముఖ్యాంశాలు..

కరోనా అనుమానితుల తరలింపునకు ఆర్టీసీ

‘క్వారంటైన్‌’ ఇళ్లకు జియో ట్యాగింగ్‌ 

సినిమా

మా ఆవిడ ఏ పని చెబితే అది: అలీ  

బుల్లితెర కార్మికులకు యాంకర్‌ ప్రదీప్‌ చేయూత

కిచెన్‌ స్వాధీనం చేసుకున్న రాజేంద్రప్రసాద్‌

ఏఆర్‌ రెహమాన్‌ కచ్చేరీలు రద్దు 

కరోనా విరాళం

17 ఏళ్లు... 20 సినిమాలు