మాస్టర్‌ @2800

20 Feb, 2020 07:50 IST|Sakshi

నిమ్స్‌లో అతి తక్కువ ధరలో హెల్త్‌ చెకప్‌లు

రూ.2800కే మాస్టర్‌ ప్యాకేజీ

కన్సల్టేషన్‌ సేవలు ఉచితం

అత్యాధునిక పుడ్‌ కోర్టు

త్వరలో కామన్‌ ఓపీడీ సేవలు

లక్డీకాపూల్‌:నిమ్స్‌లో కార్పొరేట్‌ తరహాలోవైద్యపరీక్షల ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. పేదలకు మెరుగైన వైద్య సేవల్ని అందుబాటులోకితీసుకురావాలన్న ఉద్దేశంతో సరళతరమైన రీతిలో 12 రకాల హెల్త్‌ చెకప్‌ ప్యాకేజీలను రూపొందించారు. వీటి వివరాలను నిమ్స్‌ సంచాలకులు డాక్టర్‌ కె.మనోహర్‌బుధవారం నిమ్స్‌లో ఏర్పాటుచేసినవిలేకరుల సమావేశంలో వెల్లడించారు.హెల్త్‌ చెకప్‌ బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు సైతం అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన వైద్యసేవలనుఅందించేందుకు ప్రత్యేక దృష్టినికేంద్రీకరించినట్టు తెలిపారు. అందులో భాగంగానేరూ.2800కే మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌ చేయనున్నామన్నారు.

తెలియని వ్యాధుల నిర్ధారణకు..
తెలియని కొన్ని రకాల వ్యాధులను నిర్ధారించుకునేందుకు వైద్య పరీక్షలు ఎంతో అవసరం.  ఈ క్రమంలో అతి తక్కువ ధరలో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు 12 రకాల హెల్త్‌ చెకప్‌ ప్యాకేజీలను రూపొందించారు. ముఖ్యంగా మహిళల హెల్త్‌ ప్రొఫైల్, సీజనల్‌ జ్వరాలు వంటి అంశాలలో గతంలో రూపొందించిన మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌ ప్యాకేజీకి రోగుల నుంచి పెద్దగా స్పందన కానరాలేదు. ఆయా ప్యాకేజీలలో కొన్ని అవసరం లేని పరీక్షలు ఉన్నందున ఆయా ప్యాకేజీలకు ఆదరణ కరువైందని డైరెక్టర్‌ చెప్పారు. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక ప్యాకేజీలను రూపొందించామని వివరించారు. ఆయా ప్యాకేజీలలో హెల్త్‌ చెకప్‌ను నేరుగా గతంలోని క్యాత్‌ ల్యాబ్‌లోకి వెళ్లి పరీక్షలు చేయించుకోవచ్చన్నారు. కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చిన ప్యాకేజీల వివరాలు ఇలా ఉన్నాయి.

మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌: రూ.2,800
నిమ్స్‌ మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌ ప్యాకేజీలో హీమోగ్రామ్‌ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో హెచ్‌బీ, పీసీవీ, ఎంసీవీఎంహెచ్‌సీ, ఎంసీహెచ్‌సీ, టీఎస్‌సీ, డీసీ, పీఎల్‌టీ, రీటిక్, ఎస్‌ఆర్, పీఎస్‌ టెస్టులు చేస్తారు. అంతే కాకుండా సియూఈ, సిరమ్‌ యూరియా, సిరమ్‌ క్రియాటినైన్, ఎఫ్‌బీఎస్, పీఎల్‌బీఎస్, హెచ్‌బీఏ1సి పరీక్షలు కూడా ఉంటాయి.

డయాబెటిక్‌ హెల్త్‌ చెకప్‌: రూ.2100
డయాబెటిక్‌ హెల్త్‌ చెకప్‌ ప్యాకేజీలో హీమోగ్రామ్, లిపిడ్‌ ప్రొఫైల్, లివర్‌ ఫంక్షన్‌ టెస్ట్‌ ఉంటాయి.

ఉమెన్‌ వెల్‌నెస్‌ చెకప్‌:రూ.4700
ఉమెన్‌ వెల్‌నెస్‌ చెకప్‌ ప్యాకేజీలో హీమోగ్రామ్, లిపిడ్‌ ప్రొఫైల్‌ టెస్ట్‌లు, టీఎస్‌హెచ్, ఈసీజీ, సీఎక్స్‌ఆర్‌–పీఏ రివ్యూ, యుఎస్‌జీ – అబ్డామన్, మామోగ్రఫీ వంటి పరీక్షలతో పాటు కన్సల్టేషన్‌ ఉంటాయి. 

ఫీవర్‌ ప్రొఫైల్‌: రూ.4500
ఫీవర్‌ ప్రొఫైల్‌ ప్యాకేజీలో హీమోగ్రామ్, లివర్‌ ఫంక్షన్‌ టెస్ట్, మలేరియా స్ట్రీప్, విడాల్‌ లిట్రేస్, డెంగ్యూ సెరాలాజీ, వెల్‌ప్లెక్స్‌/స్క్రబ్‌ టైప్స్‌ రాపిడ్‌ ఐసిటీ, లెప్టొస్పిరా యాంటీబాడీస్‌ పరీక్షలు ఉంటాయి. 

ఎనీమియా టెస్ట్‌:రూ.2000
ఎనీమియా టెస్ట్‌ ప్యాకేజీలో హీమోగ్రామ్, ఐరన్‌ స్టడీస్, విటమిన్‌ బి12, ఎస్‌డిహెచ్, బైల్యురోబిన్‌ (టోటల్‌+కన్సల్టేషన్‌) పరీక్షలు ఉంటాయి. 

రెస్పిరేటరీ హెల్త్‌ చెకప్‌:రూ.1500
రెస్పిరేటరీ హెల్త్‌ చెకప్‌ ప్యాకేజీలో హీమోగ్రామ్‌ పరీక్షతో పాటుగా అబ్సల్యూట్‌ కౌంట్, పల్మనరీ ఫంక్షన్‌ టెస్ట్, ఇమ్యునాల్జాబులిన్‌ పరీక్షలు ఉంటాయి. 

బోన్‌ అండ్‌ జాయింట్‌ హెల్త్‌ చెకప్‌: రూ.2400
బొన్‌ అండ్‌ జాయింట్‌ హెల్త్‌ చెకప్‌ ప్యాకేజీలో కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, విటమిన్‌–డి, యూరిక్‌ యాసిడ్, టీఎస్‌హెచ్, ఈఎస్‌ఆర్‌ పరీక్షలతో పాటు కన్సల్టేషన్‌ సేవలు పొందవచ్చు. 

కార్డియాక్‌ హెల్త్‌ చెకప్‌: రూ.3800
కార్డియాక్‌ హెల్త్‌ చెకప్‌ ప్యాకేజీలో హీమోగ్రామ్, లిపిడ్‌ ప్రొఫైల్, ఈసీజీ, 2డి ఈకో, సీఎక్స్‌ఆర్‌–పీఏ రివ్యూ, టీఎంటీ పరీక్షలతో పాటు కన్సల్టేషన్‌ సేవలు పొందవచ్చు. 

కిడ్నీ హెల్త్‌ చెకప్‌: రూ.1900
కిడ్నీ హెల్త్‌ చెకప్‌ ప్యాకేజీలో సెరమ్‌ యూరియా, సియూఈ, సెరమ్‌ క్రియేటినైన్, సెరమ్‌ కాల్షియం, సెరమ్‌ యూరిక్‌ యాసిడ్, యూరిన్‌ మైక్రో అల్బుమిన్, సెరమ్‌ ఆల్బుమిన్‌(టోటల్‌) పరీక్షలతో పాటుగా కన్సల్టేషన్‌ సేవలు పొందవచ్చు. 

కేన్సర్‌ స్క్రీనింగ్‌: రూ.2000 (పురుషులు)
కేన్సర్‌ స్క్రీనింగ్‌ పురుషుల ప్యాకేజీలో  పీఎస్‌ఏ, యుఎస్‌జీ– అబ్డామిన్, సీఎక్స్‌ఆర్‌–పీఏ రివ్యూ, సెరమ్‌ క్రియేటినైన్, సీబీపీ, హీమోగ్రామ్, లివర్‌ ఫంక్షన్‌ టెస్ట్‌లు ఉంటాయి. 

కేన్సర్‌ స్క్రీనింగ్‌: రూ.3500 (మహిళలు)
కేన్సర్‌ స్క్రీనింగ్‌ మహిళలు ప్యాకేజీల మామోగ్రఫీ, పీఎస్‌ఏ, హిమోగ్రఫీ, లివర్‌ ఫంక్షన్‌ టెస్ట్‌ ఉంటాయి. 

టోటల్‌ థైరాయిడ్‌ ప్రొఫైల్‌: రూ.2500
టోటల్‌ థైరాయిడ్‌ ప్రొఫైల్‌ ప్యాకేజీలో టి3, టి4, టిఎస్‌హెచ్, యాంటీ థైరాయిడ్, యాంటీ బ్యాడీ, హెచ్‌ఆర్‌యుఎస్‌ నెక్‌ పరీక్షలు చేస్తారు.

లివర్‌ ప్రొఫైల్‌: రూ.2200
లివర్‌ ప్రొఫైల్‌ ప్యాకేజీలో లివర్‌ ఫంక్షన్‌ టెస్ట్‌తో పాటుగా సెరమ్‌ జీజీటీపీ, హెచ్‌ఐవీ ఈఎల్‌ఎఫ్‌ఏ, హెచ్‌బీఎస్‌ఏజీ ఈఎల్‌ఎఫ్‌ఏ, హెచ్‌సీవీ ఈఎల్‌ఐఎస్‌ఏ, యుఎస్‌జి అబ్డామిన్‌ పరీక్షలు ఉంటాయి. 

ఎగ్జిక్యూటివ్‌ హెల్త్‌ చెకప్‌: రూ.7000 (పురుషులు)
ఈ ప్యాకేజీలో హీమోగ్రామ్, లిపిడ్‌ ప్రొఫైల్, లివర్‌ ఫంక్షన్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. అదే ఎగ్జిక్యూటివ్‌ హెల్త్‌ చెకప్‌ మహిళలు ప్యాకేజీలో రూ.8000 చెల్లించాలి. వివరాలకు 040–23489023 ఫోన్‌ నెంబర్‌లో సంప్రదించాలి. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా