పట్టణ ప్రణాళికలు రెడీ! 

30 May, 2019 02:17 IST|Sakshi

23 మున్సిపాలిటీలకు మాస్టర్‌ప్లాన్లు

పెద్దపల్లి డ్రాఫ్ట్‌ మాస్టర్‌ప్లాన్‌కు గ్రీన్‌సిగ్నల్‌  

సాక్షి, హైదరాబాద్‌: కొత్త పురపాలికలకు రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రణాళికలను రెడీ చేస్తోంది. ప్రణాళికాబద్ధంగా పట్టణీకరణ జరగడానికి దోహదపడే మాస్టర్‌ప్లాన్‌లకు తుదిరూపునిస్తోంది. నూతనంగా ఏర్పడ్డ 68 పురపాలికల్లో.. 23 మున్సిపాలిటీలకు మాస్టర్‌ప్లాన్లను తయారు చేస్తోంది. ఇందులో ఇప్పటికే పెద్దపల్లి పురపాలిక ముసాయిదా మాస్టర్‌ ప్లాన్‌కు సర్కారు ఆమోదముద్ర వేసింది. మరో ఏడు మున్సిపాలిటీలకు సంబంధించిన ముసాయిదాలను రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనకు పురపాలక శాఖ పంపింది. పట్టణీకరణ, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రూపొందించే ఈ మాస్టర్‌ ప్లాన్‌లో భూ వినియోగంపై స్పష్టతనిస్తోంది. 

రహదారులకు పెద్దపీట! 
పట్టణాభివృద్ధికి దిక్సూచిగా చెప్పుకునే మాస్టర్‌ప్లాన్‌లో జోనల్‌ రెగ్యులైజేషన్‌ను విధిగా పాటించాల్సి వుంటుంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీల్లో అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టకుండా బ్రేక్‌ పడనుంది. నిర్దేశిత జోన్‌లో మాత్రమే నివాస భవనాలకు అనుమతులు జారీ చేయనున్నారు. రెసిడెన్షియల్‌ జోన్‌లో మాత్రమే ఈ కట్టడాలను అనుమతిస్తారు. అలాగే కమర్షియల్‌ జోన్‌లో వాణిజ్య కార్యకలాపాలను, రిక్రియేషన్‌/కన్జర్వేషన్‌ జోన్‌ను కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. వీటితోపాటు మాస్టర్‌ప్లాన్‌ ఇండస్ట్రియల్‌ జోన్‌తోపాటు ప్రజావసరాలు, మౌలిక వసతులు, రహదారుల విస్తరణపై కూడా స్పష్టత నివ్వనున్నారు. ఈ మాస్టర్‌ ప్లాన్‌కు అనుగుణంగానే ఆయా మున్సిపాలిటీల్లో అనుమతులు జారీ చేయనున్నారు.  

ప్రభుత్వ పరిశీలనకు ఎనిమిది 
ఇప్పటికే పెద్దపల్లి మాస్టర్‌ ప్లాన్‌కు ప్రభుత్వం ఓకే చెప్పగా.. మహబూబాబాద్, భూపాలపల్లి, అందోల్‌–జోగిపేట్, దేవరకొండ, కొల్లాపూర్, నాగర్‌కర్నూలు, అచ్చంపేట పురపాలికల ముసాయిదా మాస్టర్‌ప్లాన్‌లు ప్రభుత్వ పరిశీలనకు వెళ్లాయి. ఇవిగాకుండా.. బాదేపల్లి, హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక, కల్వకుర్తి, కోదాడ, హుజూర్‌నగర్, ఐజ, నర్సంపేట, పరకాల, హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లెందు, బెల్లంపల్లి, మణుగూరు మున్సిపాలిటీల మాస్టర్‌ప్లాన్లను డైరెక్టర్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ విభాగం (డీటీసీపీ) చకచకా రూపొందిస్తోంది. వీటన్నింటికి త్వరితగతిన ఆమోదముద్ర వేయించడం ద్వారా ఆగస్టు నుంచి మనుగడలోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఇదిలావుండగా, ఇప్పటికే వివిధ నగరాభివృద్ధి సంస్థలు మాస్టర్‌ప్లాన్లను అమలు చేస్తున్నాయి. తాజాగా ఏర్పడ్డ మున్సిపాలిటీల్లో అధికశాతం వీటి పరిధిలోకి వస్తున్నందున అమలులో ఉన్న మాస్టర్‌ప్లాన్లే వీటికి వర్తించనున్నాయి.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘చింతమడక స్కీమ్‌’ అని పెట్టినా ఓకే..కానీ

ఈనాటి ముఖ్యాంశాలు

గుండాల ఎన్‌కౌంటర్‌ : హైకోర్టు కీలక ఆదేశాలు..!

యాదాద్రిలో కలకలం: జింక మాంసంతో విందు

కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్‌ భేటీ

చార్మినార్‌ ఘటనలో కానిస్టేబుల్‌ సస్పెండ్‌

థర్మల్ విద్యుత్‌లో ‘మేఘా’ ప్రస్థానం

నయీం కేసులో రాజకీయ నాయకులపై చర్యలేవీ?

ఆసియా దేశాల సదస్సుకు తెలంగాణ ఎన్నారై అధికారి

ఉప సర్పంచ్‌ నిలువునా ముంచాడు..!

పేదలకు వైద్యం దూరం చేసేలా ప్రభుత్వ వైఖరి

తస్మాత్‌ జాగ్రత్త..!

‘కిషన్‌ది ప్రభుత్వ హత్యే’

లోన్‌ సురక్ష విస్తరణ సేవలు ప్రారంభం

పైసలు లేక పస్తులు 

హామీలను మరిచిన కేసీఆర్‌

నయీం కేసులో బయటపడ్డ సంచలన విషయాలు

ఆపరేషన్‌కు సహకరించడం లేదని...

ఫేస్‌బుక్‌ మిత్రుల ఔదార్యం

‘హాజీపూర్‌’ కేసులో చార్జ్‌షీట్‌ దాఖలు

శ్రీ చైతన్య.. కాదది.. తేజ

ఇంకా మిస్టరీలే!

ఈ ఆటో డ్రైవర్‌ రూటే సెపరేటు

అతి చేస్తే ఆన్‌లైన్‌కి ఎక్కుతారు.. 

చైన్‌స్నాచర్లపై తిరగబడ్డ మహిళలు 

సుల్తాన్‌పూర్‌లో దొంగల బీభత్సం 

ముమ్మాటికీ బూటకమే.. 

పైసలిస్తేనే సర్టిఫికెట్‌! 

వైద్యం అందక గర్భిణి మృతి

పోలీసు పిల్లలకూ ‘జాబ్‌ కనెక్ట్‌’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కెప్టెన్‌ లేకుండానే నడుస్తోంది!

దగ్గుబాటి మామ.. అక్కినేని అల్లుడు వచ్చేస్తున్నారు

‘జార్జిరెడ్డి’ ఫస్ట్‌ లుక్‌

తమన్నాకు ఏసీ లేకుండా నిద్రపట్టదంటా!

ఇస్మార్ట్‌ సినిమాలపై ఓ లుక్కేద్దాం

బిగ్‌బాస్‌ హౌస్‌లో పవర్‌ గేమ్‌