అందుబాటులో 267 మాన్సున్‌ ఎమర్జెన్సీ బృందాలు

31 May, 2020 19:52 IST|Sakshi

నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం

సహాయక చర్యలను పరిశీలించిన మేయర్‌ బొంతు రామ్మోహన్‌

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ఆదివారం పలు ప్రాంతాల్లో భారీ వర్షం ముంచెత్తడంతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది చేపట్టిన సహాయక చర్యలను మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పరిశీలించారు. కేబీఆర్ పార్కులో ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరంలో 267 మాన్సున్‌ ఎమర్జెన్సీ బృందాలను అందుబాటులో ఉంచామని తెలిపారు.16 డిఆర్‌ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.70 జేసీబీలను కూడా అందుబాటులో ఉంచామన్నారు. చెట్లు పడిన 10 ప్రాంతాల్లో వెంటనే క్లియర్ చేశామని పేర్కొన్నారు. అధికంగా నీళ్లు నిలిచిపోయే 30 ప్రాంతాలను గుర్తించామని.. అక్కడ నీళ్లు తోడేందుకు మోటార్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. గత మూడేళ్లుగా నగరంలో 1500 శిథిల భవనాలను కూల్చివేశామని.. మరో 200 భవనాలను గుర్తించామన్నారు. వాటిని త్వరలోనే కూల్చివేస్తామని బొంతు రామ్మోహన్‌ వెల్లడించారు.


 

మరిన్ని వార్తలు