అంతా అక్రమార్కుల ప్లాన్‌ ప్రకారమే!

31 Aug, 2019 12:06 IST|Sakshi

‘అక్రమార్కుల మాస్టర్‌ ప్లాన్‌’కు బల్దియా అధికారుల మద్దతు!

సిబ్బంది నుంచి అధికారుల వరకు పొంతనలేని మాటలు

అనుమానాలకు తావిస్తున్న సమాధానాలు

రాజకీయ ఒత్తిళ్లే కారణమా..?

సాక్షి, మెదక్‌: అక్రమాలకు తావులేకుండా చూడాల్సిన అధికారులే అక్రమార్కులకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారు. మాస్టర్‌ప్లాన్‌ రోడ్డులో వెలిసిన కట్టడాలను తొలగించకుండా చోద్యం చూస్తుండడంతో పాటు సదరు యజమానులకు పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారు. లోపాయికారి ఒప్పందాలతో ‘అక్రమార్కుల మాస్టర్‌ప్లాన్‌’కు బల్దియా అధికారులు వత్తాసు పలుకుతుండడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అధికారులు, సిబ్బంది పొంతనలేని మాటలు చెబుతుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

మెదక్‌ పట్టణంలోని గంగినేని థియేటర్‌ ఎదుట కెనాల్‌ పక్కన మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డులో నిర్మించిన భవనాన్ని పరిశీలిస్తున్న అధికారులు అక్రమార్కులకు కొమ్ముకాసేలా పలువురు బల్దియా అధికారులు భలే ‘ప్లానింగ్‌’తో ముందుకు సాగుతున్నారు. మాస్టర్‌ ప్లాన్‌లో ఉన్న రహదారులపై నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మాణాలను చూస్తూనే ఉన్నారు. కాని చర్యలు తీసుకోవడం లేదు. వారికి ‘మేమున్నాం.. మీకేం కాదు’ అనే భరోసా కల్పిస్తున్నారు. మెదక్‌ పట్టణ పరిధిలోని గంగినేని థియేటర్‌ ఎదుట కెనాల్‌ అనుకుని పంప్‌హౌస్‌కు వెళ్లే దారిలో, అజంపూర్‌లో మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డుకు ఎసరుపెట్టి అక్రమంగా భవనాలు నిర్మించిన ఘటనకు సంబంధించి ‘సాక్షి’లో రహ‘దారి’ మాయం శీర్షికన ఇటీవల కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ అక్రమ కట్టడాలకు సంబంధించి సదరు నిర్మాణదారులకు అవినీతికి అలవాటు పడ్డ పలువురు బల్దియా అధికారులు పూర్తిస్థాయిలో అండదండలు అందజేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు భారీగా ముడుపులు ముట్టడమే కారణమని తెలుస్తోంది. 

అధికారులు, సిబ్బంది తలోమాట..
మాస్టర్‌ప్లాన్‌ రోడ్డులో అక్రమ కట్టడాలకు సంబంధించి టౌన్‌ప్లానింగ్‌లోని సిబ్బంది నుంచి మొదలు ఆ విభాగంలోని వివిధ స్థాయిల్లో ఉన్న ఉద్యోగులు, అధికారులు పొంతన లేని సమాధానాలు చెబుతూ సమస్యను పక్కదారి పట్టించేలా వ్యవహరిస్తున్నారు. గంగినేని థియేటర్‌ వద్ద నిర్మించిన భవనం కెనాల్‌ బఫర్‌ జోన్‌ పరిధిలో ఉందని.. ఇరిగేషన్‌ శాఖ నుంచి నో ఆబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఓసీ) తీసుకొస్తే అనుమతులిచ్చామని ఓ అధికారి చెప్పారు. మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డులో భవనం లేదని ముక్తకంఠంతో సమాధానమిచ్చారు. మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డులో లేదని కచ్చితంగా చెప్పగలరా అని ప్రశ్నిస్తే బఫర్‌ జోన్‌ను రోడ్డుగా ఉపయోగించుకోవచ్చు.. ఇది బఫర్‌ జోన్‌ కమ్‌ మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు అని సమాధానమిచ్చారు.

మాస్టర్‌ ప్లాన్‌ 1992 అమల్లోకి వచ్చిన తర్వాతే బిల్డింగ్‌ నిర్మాణమైందని.. పిల్లర్‌ గుంతలు తీసిన తర్వాత నోటీసులు జారీ చేశామని మరో అధికారి చెప్పడం విశేషం. ఇన్నాళ్లు ఎందుకు ఊరుకున్నారని ప్రశ్నిస్తే మున్సిపాలిటీయే అనుమతి ఇవ్వడంతో అంటూ సమాధానం దాటవేశారు. గత అధికారుల తప్పిదంతో ఇలాంటివి చోటుచేసుకున్నాయని ఇంకో అధికారి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండడం గమనార్హం. అజంపూర్‌కు సంబంధించి మాత్రం చాలా ఏళ్ల క్రితం జరిగింది.. రికార్డులు వెలికి తీసే పనిలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఒకరికి నోటీసుల జారీ.. మరొకరికి త్వరలో..
ఈ అక్రమ కట్టడాలపై తలోమాట చెబుతున్న అధికారులు కలెక్టర్‌ సీరియస్‌ వార్నింగ్‌ ఇవ్వడంతో నోటీసులకు ఉపక్రమించారు. గంగినేని థియేటర్‌ వద్ద కెనాల్‌ను ఆనుకుని మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డులో నిర్మించిన భవన నిర్మాణదారుడికి నోటీసులు జారీచేసినట్లు తెలిపారు. మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డులో లేదని ఒకసారి.. ఉందని ఒకసారి  చెబుతూ వచ్చిన అధికారులు ప్రస్తుతం సెట్‌బ్యాక్‌తో కలిపి ఆరు మీటర్లు రోడ్డు పరిధిలోకి వచ్చిందని.. ఈ మేరకు డీవియేషన్‌ నోటీసులు ఇచ్చామని.. అజంపూర్‌కు సంబంధించి ఒకరికి నోటీసులు జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెబుతుండడం గమనార్హం. 

రాజకీయ ఒత్తిళ్లే కారణమా..?
బల్దియా అధికారులు, సిబ్బంది తలోమాటకు పొలిటికల్‌ ఒత్తిళ్లే కారణమని తెలుస్తోంది. గత పాలక వర్గానికి చెందిన పెద్ద మనుషులు చెప్పినట్లు నడుచుకున్నామని.. ఇందులో తమకేం సంబంధం లేదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి ఆవేదన వెళ్లగక్కారు. ప్రస్తుతం సైతం వారి ఒత్తిళ్లు తమపై ఉన్నాయని చెబుతున్నారు. దీన్ని బట్టి గత పాలక వర్గంలోని పలువురికి పెద్దమొత్తంలో ఆమ్యామ్యాలు అందినట్లు బల్దియా వర్గాలో చర్చ జోరుగా సాగుతోంది.  

కలెక్టర్‌ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం
మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డులో అక్రమంగా నిర్మించిన కట్టడాలకు సంబంధించి కలెక్టర్‌ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు నోటీసులు జారీ చేశాం. వారం రోజుల్లోగా విచారణ పూర్తి చేసి చర్యలు తీసుకుంటాం. కలెక్టర్‌కు నివేదిక సైతం సమర్పిస్తాం. 
– సమ్మయ్య, మున్సిపల్‌ కమిషనర్, మెదక్‌ 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు!

అఖిలపక్ష నేతల పొలికేక

క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తిస్తే రూ.500 పారితోషికం

రేవంత్‌ రెడ్డి క్షమాపణ చెప్పాలి: కేటీపీఎస్‌ ఉద్యోగులు

ఎకరం లేఅవుట్‌ ఏదీ ఆదాయం?

స్థాయీ సంఘాల ఏర్పాటుకు ముహూర్తం

మలుపు తిరుగుతున్న శ్రీనివాస్‌ మృతి కేసు

రైతులకు ఇన్సూరెన్సు తగ్గించిన సహకార బ్యాంకు!

ఐసీడీఎస్‌లో అవినీతి కోణం

నిజాయితీ చాటుకున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌

పెట్రోల్‌ బంకుల్లో కల్తీ దందా

ఇంజక్షన్‌ వికటించి వైద్యుడు మృతి

'బవొబాబ్‌' 500 ఏళ్లు

వారం రోజుల్లో మద్యం దుకాణాలకు టెండర్లు

అనగనగా ఓ రచయిత్రి

‘ప్లాంట్‌ గణేశ్‌’ విగ్రహాలు

అభాసుపాలైన టాస్క్‌ఫార్స్‌..!

సెల్‌ టవరెక్కి మహిళ హల్‌చల్‌

స్పందించిన పోలీస్‌ హృదయం

మత్స్యగిరీశుడికి మహర్దశ!

ఆక్వాలో నంబర్‌ వన్‌కు చేరాలి

‘కరెంట్‌’ రికార్డు! 

రేవంత్‌పై భగ్గుమన్న విద్యుత్‌ ఉద్యోగులు 

లుక్కుండాలె.. లెక్కుండాలె..!

అందుబాటులోకి మరో రెండు అర్బన్‌ పార్క్‌లు 

‘విద్యుత్‌’పై శ్వేతపత్రం ఇవ్వాలి

సోషల్‌ మీడియా బూచోళ్లు..

10 ఎకరాలకే ‘రైతుబంధు’

పల్లెకు 30 రోజుల ప్లాన్‌ ! 

మెడికల్‌ సీట్లలో భారీ దందా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మా ఐరా విద్యా మంచు: విష్ణు

ఇద్దరు భామలతో విశాల్‌

నో మేకప్‌... ప్లీజ్‌!

మళ్లీ సినిమా చేస్తాం

ఫస్ట్‌ లేడీ

సైకిల్‌ షాప్‌ కుర్రాడి కథ