స్వామి వారితో బయలుదేరినా పెనుక వంశస్థులు

5 Feb, 2020 14:44 IST|Sakshi

సాక్షి, మేడారం(మహబూబాబాద్‌): సమ‍్మక్క-సారలమ్మ జాతరలో భాగంగా బుధవారం మేడారంలోని గద్దెలపై సమ్మక్క భర్త పగిడిద్దరాజును పూజరులు ప్రతిష్టించనున్నారు. ఈ క్రమంలో  గంగారం మండలం పోనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును తీసుకుని పెనుక వంశస్తులు కాలినడకన ప్రయణమయ్యారు. అటవీ మార్గం గుండా దాదాపు 66 ​కి.మీ నడుచుకుంటూ మేడారం గద్దెల వద్దకు చేరుకుని పగిడిద్దను రాజును ప్రతిష్టించనున్నారు. ఈ సందర్భంగా పోనుగొండ్ల గ్రామ ప్రజలంతా నేడు  తమ ఇళ్లను మట్టితో పూతపూసి, రంగురంగు ముగ్గులతో అలంకరించుకుంటారు. పెనుక వంశస్థులు ఇంటి నుంచి స్వామి వారిని కుంకుమ భరణి రూపంలో ఆలయానికి తీసుకొస్తారు. పడగ రూపంలో అలంకరించిన స్థానిక స్వామివారి ప్రతిమతో అటవీ మార్గం గుండా కాలినడకన గిరిజనులు మేడారం బయలుదేరారు. కన్నెపల్లి నుంచి సారక్క, కొండాయి నుంచి గోవిందరాజులు సైతం రాత్రికి సమ్మక్క ఆలయానికి  చేరుకుంటారు. అక్కడ పూజారులంతా కలిసి పూజలు చేసి దేవుళ్లను గద్దెలపై ప్రతిష్టిస్తారు.  

ఈ క్రమంలో ఆలయ అధికారులు సమ్మక్క, సారక్క గద్దెలను ఆలయ ప్రాంగణాన్ని  వివిధ రకాల పువ్వులతో అలంకరిస్తారు. ఇందుకోసం దాత వద్దిరాజు రవిచంద్ర ప్రత్యేకంగా బెంగుళూరు నుంచి పువ్వులను తెప్పించారు. కాగా సమ్మక్క సారలమ్మ జాతరకు సీఎస్‌ సోమేష్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి హెలికాప్టర్‌లో అక్కడి చేరుకున్నారు. ఈ  సందర్భంగా అధికారులతో జాతర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు ఛత్తిష్‌ఘడ్‌ హోంమంత్రి కుటుంబంతో ఆలయాన్ని వచ్చారు.

మరిన్ని వార్తలు