ఆ అధికారి బదిలీ మేము జీర్ణించుకోలేకపోతున్నాం

8 Sep, 2019 19:12 IST|Sakshi
కలెక్టర్‌ ఎంవీ రెడ్డితో జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి(ఫైల్‌)

సాక్షి,మేడ్చల్‌(హైదరాబాద్‌) : మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా రెవెన్యూ శాఖకు బదిలీ కావడం జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. డిప్యూటీ తహసీల్దార్ నుంచి అంచెలు అంచెలుగా ఎదిగిన శ్రీనివాస్రెడ్డి జాయింట్ కలెక్టర్ స్థాయికి చేరుకున్నారు. మేడ్చల్‌ జాయింట్‌ కలెక్టర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఏడాదిన్నర కాలంలో రెవెన్యూశాఖలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. రిజర్వాయర్ నిర్మాణం కోసం బొమ్మరాసిపేటలో రైతులను ఒప్పించి భూములను సేకరించగలిగారు. ప్రభుత్వ పథకాలు నేరుగా పేద ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించడంలో శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు.జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సందర్శకులు, బాధితులు ఎవరొచ్చినా ఆప్యాయంగా పలకరిస్తూ మర్యాదపూర్వకంగా మెలిగేవారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.వి రెడ్డి ఆదేశాలను పాటిస్తూనే ఉద్యోగులందరితో ఐక్యంగా మెలుగుతూ మంచి అధికారిగా గుర్తింపు సాధించారు. జిల్లా ప్రజల హృదయాన్ని గెలుచుకున్న శ్రీనివాస రెడ్డి బదిలీ ఆగిపోతే బాగుంటుందని ప్రజాప్రతినిధులు కోరుకుంటున్నారు.


 

మరిన్ని వార్తలు