కేఎంసీలో ఎంసీఐ తనిఖీ

11 Nov, 2014 03:48 IST|Sakshi
కేఎంసీలో ఎంసీఐ తనిఖీ

ఎంజీఎం : కాకతీయ మెడికల్ కళాశాలతోపాటు అనుబంధ ఆస్పత్రులైన మహాత్మాగాంధీ మెమోరియల్ ఆస్పత్రి, రీజినల్ కంటి ఆస్పత్రి, సీకేఎం, జీఎంహెచ్ ఆస్పత్రుల్లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) బృందం సభ్యులు సోమవారం పర్యటించారు. గత ఏడాది ఎంసీఐ సభ్యు లు తనిఖీలు నిర్వహించినపుడు కళాశాల పరిధిలో 150 సీట్లలో అదనంగా పెంచిన 50 సీట్లకు సౌకర్యాలు లేవని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంతోపాటు డీఎంఈ పుట్ట శ్రీని వాస్, కేఎంసీ ప్రిన్సిపాల్ రమేశ్‌ కుమార్ ఢిల్లీలో ఎంసీఐ సభ్యులను కలిసి వసతులు కల్పిస్తామని పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. దీంతో పెంచిన సీట్లను కొనసాగించేందుకు ఎంసీఐ నిర్ణయించింది. ఈ క్రమంలో కేఎంసీ, అనుబంధ ఆస్పత్రుల్లో ఎంసీ ఐ సభ్యులు దేశ్‌ముఖ్ (మహారాష్ట్ర), అరుణ్‌వ్యాస్ (అహ్మద్‌బాద్), జేఎం జడేజా (అహ్మద్‌బాద్), సుమన్ బన్సాలీ (జోధ్‌పూర్) తనిఖీ చేశారు.
 
విడివిడిగా పరిశీలనలు
కళాశాలకు అనుబంధంగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యవిద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను దేశ్‌ముఖ్, అరుణ్‌వ్యాస్ క్షుణ్ణంగా పరిశీలించారు. మొదటగా ఓపీ విభాగంతోపాటు బ్లడ్‌బ్యాంక్, సెంట్రల్ ల్యాబ్, రెడియోలజీ, అత్యవసర చికిత్స విభాగాలను తనిఖీ చేశారు. అనంతరం ఏఎంసీ, ఐఎంసీ, ఆర్‌ఐసీయూ, ఐసీసీయూ, మెడికల్, సర్జికల్ వార్డులను సందర్శించారు. రోగులకు సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు.

మరో ఇద్దరు ఎంసీఐ సభ్యులు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కేఎంసీలో తనిఖీ చేశారు.  సీకేఎంతోపాటు జీఎంహెచ్‌లో కూడా తనిఖీలు కొనసాగారుు. సభ్యులు ఆస్పత్రిలోని గైనిక్, పోస్టు ఆపరేటివ్, లేబర్, స్కా నింగ్ గదులను పరిశీలించారు. అనంతరం ఆస్పత్రి పరిపాలనాధికారులతో సమావేశమై ఆస్పత్రిలోని సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం కేఎంసీలో సిబ్బంది వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మొ త్తం 9 గంటలపాటు ఎంసీఐ తనిఖీలు నిర్వహించింది. కాగా, గత ఏడాది కేఎంసీ సీనియర్ రెసిడెన్సీలో సౌకర్యాలు సక్రమంగా లేవని ఎంసీఐ  తనిఖీల్లో తేలగా, ఈ లోపాలను సవరించినట్లు అధికారులు తెలిపారు.
 
నేడు డీఎంఈ రాక

కళాశాలలో ఎంసీఐ సభ్యులు తనిఖీ లు నిర్వహిస్తున్న సమయంలో జూని యర్ డాక్టర్లు సమ్మెలో ఉండడంతో మెడికల్ సీట్లకు అడ్డంకులు రాకుండా ఉండేందుకు మంగళవారం డీఎంఈ శ్రీనివాస్... కేఎంసీకి రానున్నారు.

>
మరిన్ని వార్తలు