వైద్యుల సలహాతోనే రంజాన్‌ ఉపవాసాలు

28 Apr, 2020 03:40 IST|Sakshi

ప్రార్థనలు, జకాత్‌ సమయంలో భౌతిక దూరం పాటించాలి

పండుగ శుభాకాంక్షలు ‘డిజిటల్‌’గా చెప్పుకోవాలి

రోగుల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయండి

రంజాన్‌ మార్గదర్శకాలను విడుదల చేసిన వైద్యారోగ్య శాఖ

సాక్షి, హైదరాబాద్‌: ‘ఉపవాసంతో కరోనా సోకే ప్రమాదం ఉన్న ట్లు ఎలాంటి అధ్యయనాల్లో తేలలేదు. గతంలో తరహాలోనే ఈ రంజాన్‌ సందర్భంగా ఆరోగ్యవంతులు ఉపవాసం ఉండవచ్చు. అయితే, కరోనా రోగులు మాత్రం వైద్యులను సంప్రదించి, వారి సలహా మేరకు ఉపవాసం ఉంటే మంచి ది’అని రాష్ట్ర వైద్యారోగ్య శా ఖ సలహా ఇచ్చింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్గదర్శకాలను విడుదల చేసింది.

డిజిటల్‌ శుభాకాంక్షలే
భౌతికదూరం పాటిస్తూ ప్రా ర్థనలు చేసుకోవచ్చు. రోగు ల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయడంతో పాటు వారికి ఓ దార్పు సందేశాలను పంపు తూ వారికి మానసిక ధైర్యా న్ని ఇవ్వండి. పరస్పర శుభాకాంక్షలు తెలుపుకోవడానికి డిజిటల్‌ ప్లాట్‌ఫారాలను వినియోగించుకోవాలి.

ఆరోగ్యకరమైన ఆహారం 
రంజాన్‌ మాసంలో పోషకాహారం చాలా ముఖ్యం. తాజా కూరగాయాలు, పండ్లతో పాటు బలవర్థకమైన ఆహారాన్ని తినాలి. పుష్కలంగా నీళ్లు తాగాలి. 
శారీరక శ్రమ: కరోనా మహమ్మారి సమయంలో చాలా మంది ప్రజలు ఎలాంటి శారీరక శ్రమ లేకుండా ఇంటికే పరిమితమవుతున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా శారీరక వ్యాయామ పద్ధతులను తెలుసుకుని పాటించడం ద్వారా శరీర దృఢత్వాన్ని పెంచుకోవాలి.

ఇఫ్తార్‌ విందులకు నో..
► రంజాన్‌ సందర్భంగా పేదలకు పంపిణీ చేసే జకాత్‌    (వితరణ) సమయంలో భౌతిక దూరాన్ని పాటించండి. 
► రద్దీతో ముడిపడిన ఇఫ్తార్‌ విందులను నివారించి, ముందుగా ప్యాక్‌ చేసిన ఆహారాన్ని, బహుమతులను పంపిణీ చేయండి. 
► పొగాకు ఉత్పత్తులైన సిగరెట్, బీడీ, వాటర్‌ పైప్స్‌ వంటి సాధనాల ద్వారా పొగ పీల్చడం వల్ల కరోనా వ్యాధి ప్రమాద స్థాయిని పెంచే అవకాశముంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇవి అనుమతించబడవు.

మరిన్ని వార్తలు