ఇక ఊరూరా వైద్య సేవలు

16 Jul, 2014 04:48 IST|Sakshi

 నిజామాబాద్ అర్బన్ : తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటున్న నిర్ణయాలతో జిల్లాలో ప్రభుత్వ ఆ స్పత్రుల తీరు మరింతగా మెరుగుపడనుంది. ప్రతి పల్లెకు సంపూర్ణ వైద్య సేవలు అందిస్తామని ఇటీవలే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య ప్రకటించారు. ఇం దులో భాగంగానే, జిల్లాలో పెరిగిన జనాభాకు అనుగుణంగా ప్రతి గ్రామానికి ప్రభుత్వ వైద్య సేవలు అందించేందుకు కొత్త విధానాలు అమలులోకి రానున్నాయి. ఇందుకు కావలసిన సౌకర్యాలు సమకూర్చాలని కోరుతూ  జిల్లా వైద్య ఆరో గ్యశాఖ అధికారులు ఇటీవలే ఉన్నతాధికారులకు ఓ నివేదికను సమర్పించారు. కొత్తగా మరిన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు ఏర్పాటు చేయాలని, పట్టణ ఆరోగ్య కేంద్రాల స్థాయిని పెంచాలని నివేదించారు.  

 ఇదీ పరిస్థితి
 జిల్లాలో ఇప్పటికే 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మూడు ఏరియా ఆస్పత్రులు, 377 ఆరోగ్య ఉప కేంద్రాలు,ఆరు కమ్యూనిటీ ఆస్పత్రులు ఉన్నాయి. పెరిగిన జనాభాకు అనుగుణంగా కొత్తగా మరో 25 ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.  జిల్లాలో 25.51 లక్షల జనాభా ఉంది. ప్రతి 30 వేల నుంచి 40 వేల జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలి. అదే విషయాన్ని నివేదికలో ప్రస్తావించారు.

 అదనంగా ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు ఉన్నతాధికారులు కూడా సుముఖంగా ఉన్న ట్లు తెలిసింది. గతంలోనే తొమ్మిది ఆరోగ్య కేంద్రాలను మంజూరు చేశారు. తిర్మన్‌పల్లి, చౌట్‌పల్లి, పోచంపాడ్, కిషన్‌నగర్, గోవింద్‌పేట, దేవునిపల్లి, పెగడపల్లి, ఏర్గట్ల, పుల్కల్ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు అనుమతి వచ్చిం ది. వీటి ఏర్పాటుకు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. ఇవే కాకుండా భీమ్‌గల్, బాన్సువాడ డివిజన్, ఆర్మూర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి డి విజన్, నిజామాబాద్ రూరల్‌లో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను ఏర్పాటు చే యాలని నిర్ణయించారు. ముఖ్యంగా తండాలలో ఆరోగ్య ఉప కేంద్రాలను ఏ ర్పాటు చేయాలని విన్నవించారు.

ఇందుకు అనుగుణంగా వై ద్యులు, సిబ్బం దిని అదనంగా నియమించనున్నారు. ఈ ఆస్పత్రులలలో అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులో ఉంచనున్నారు. గర్భిణీలకు మందులు, ప్రసవాని కి సంబంధించి సేవలు, రోగ నిర్ధారణ పరీక్షలు, మందులను అక్కడే అందించాలని నిర్ణయించారు.   

 ఇక్కడ కూడా
 పట్టణ ఆరోగ్య కేంద్రాల స్థాయిని పెంచాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. వీటిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుగా మార్చనున్నారు. లక్ష వరకు జనాభా ఉన్న ప్రాంతాన్ని ఒక సర్కిల్‌గా తీసుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించి ఎన్‌ఆర్‌హెచ్‌ఎం సర్వే ప్రకారం విశ్లేషణ జరుగుతోంది. జిల్లాలో పది పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో ఏడు, బోధన్‌లో రెండు, కామారెడ్డిలో ఒకటి ఉన్నాయి. ఇందులో వైద్యుడు, ఇద్దరు ఏఎన్‌ఎంలు, కమ్యూనిటీ మొబైల్ ఆఫీసర్, ఇద్దరు అటెం డర్లు, ఒకరు ఫార్మసిస్టు ఉంటారు. స్థాయి పెరిగితే సిబ్బంది సంఖ్య కూడా పెరుగుతుంది. ప్రతి రోగానికి సంబంధించి మందులు, వైద్యసేవలు అందుబాటులో ఉంచుతారు.

>
మరిన్ని వార్తలు