ఓరుగల్లులో మెగా వైద్య శిబిరం

8 Feb, 2015 14:21 IST|Sakshi
ఓరుగల్లులో మెగా వైద్య శిబిరం

కరీమాబాద్: వరంగల్ జిల్లా కరీమాబాద్ ప్రాంతంలో ‘మానవసేవే-మాధవసేవ’  ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 500 మంది పేదలు పాల్గొన్నారు. సాధారణ జబ్బులతో పాటు గుండె, ఎముకలు, కంటికి, స్త్రీ సంబంధిత వ్యాధులకు చెందిన నిపుణులైన వైద్యుల బందం ఈ శిబిరంలో ఉచితంగా సేవలందించనున్నారు.

ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు వైద్య సేవలందిస్తామని నిర్వాహకులు తెలిపారు. రోగులకు మందులను ఉచితంగా పంపిణీ చేశారు. సన్‌షైన్, వరంగల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్, వరంగల్ లయన్స్ క్లబ్‌కు చెందిన వైద్యులు ఈ శిబిరంలో పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు