ట్రెండీ హార్ట్స్‌

22 Jan, 2019 09:06 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: రానున్న వలంటైన్స్‌ డేను పురస్కరించుకుని మార్కెట్‌లోకి వెరైటీ డిజైన్లతో ఆభరణాలు విడుదలవుతున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ ఆభరణాల బ్రాండ్‌ మెలొర్రా.. హృదయాకార డిజైన్‌ను మధ్యభాగంలో అమర్చి రూపుదిద్దిన ఆభరణాలను ప్రత్యేకంగా అందిస్తోంది. ‘ట్రెండీ హార్ట్స్‌’ పేరుతో ఈ కలెక్షన్‌ను హైదరాబాద్‌ మార్కెట్లోకి విడుదల చేసినట్లు సంస్థ సంస్థ సీఈఓ సరోజ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిస్కో సీక్వెన్స్, నైఫ్‌ ప్లీట్స్, ఫ్లవర్‌ బొకె, యానిమల్‌ ప్రింట్, బౌస్‌ అండ్‌ నియోన్‌ తదితర వెరైటీలు ఈ కలెక్షన్‌లో ఉన్నాయని, తమ ఇష్టసఖికి గుర్తుండిపోయేలా అందమైన బహుమతిని ఇవ్వాలని ఆశించే పురుషుల అభిరుచులకి తగ్గట్లుగా ఇవి ఆకట్టుకుంటాయని ఆమె వివరించారు.

>
మరిన్ని వార్తలు