కేసీఆర్‌ తాతా.. ఆదుకో

30 Jul, 2018 14:38 IST|Sakshi
సమ్మె శిబిరంలో కూర్చున్న మెప్మా ఆర్పీల పిల్లలు 

కామారెడ్డి క్రైం: మెప్మా రిసోర్స్‌ పర్సన్‌లు చేపట్టిన సమ్మె ఆదివారం 26వ రోజుకు చేరుకుంది. జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన సమ్మె శిబిరంలో రిసోర్స్‌ పర్సన్‌లతోపాటు వారి పిల్లలు పాల్గొన్నారు. ‘కేసీఆర్‌ తాతా.. మా కుటుంబాలను ఆదుకోవా, మా అమ్మల న్యాయమైన డిమాండ్‌లను పరిష్కరించాలి’ అన్న ప్లకార్డులు ప్రదర్శించారు.

ఈ సందర్భంగా మెప్మా ఆర్పీల ప్రతినిధి దత్తేశ్వరి మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం 26 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. శనివారం ప్రభుత్వ ప్రతినిధిని కలిసి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీ నాయకులు కొందరు తమను కించపర్చే విధంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. దానికి నిరసనగా పిల్లలతో కలిసి సమ్మెలో పాల్గొంటున్నామన్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.

మరిన్ని వార్తలు