అకస్మాత్తుగా నిలిచిపోయిన మెట్రో రైల్‌

19 Nov, 2019 19:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అమీర్‌పేట్‌లో మెట్రో రైల్‌ అకస్మాత్తుగా నిలిచిపోయింది.  షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా నాగోల్‌ నుంచి హైటెక్‌ సీటీ వైపు వెళ్తున్న రైలులో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చి ఆగిపోయింది. మెట్రో పిల్లర్‌ పైనుంచి ఓ ఇనుపరాడ్‌ కిందపడింది. రోడ్డుపై జనం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో రైల్‌లోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.  సమాచారం తెలుసుకున్న మెట్రో సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చెరుకొని మరమ్మతులు చేస్తున్నారు. రైలు ముందుకు కదలకపోవడంతో ప్రయాణికులను కిందకు దించేశారు. మరమ్మతుల నిమిత్త అమీర్‌పేట్‌- నాగోల్‌ రూట్‌లో మెట్రో సర్వీసులు నిలిపివేశారు. 
 

>
మరిన్ని వార్తలు