ఎంజీఎంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మెరుపు సమ్మె

28 Jan, 2015 10:44 IST|Sakshi

వరంగల్: వరంగల్‌లోని ఎంజీఎం ప్రభుత్వ ఆస్పత్రిలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు బుధవారం ఉదయం మెరుపు సమ్మెకు దిగారు. ఏడాదిగా తమకు వేతనాలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యను కలెక్టర్‌తోపాటు గతంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న రాజయ్య దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని తెలిపారు.

 

తమ ఈఎస్‌ఐ, పీఎఫ్ ఖాతాల్లో చందాలు జమ చేయటం లేదని ఆరోపించారు. విధులు బహిష్కరించి, వారు ధర్నాకు దిగటంతో వైద్య సేవలకు పాక్షికంగా అంతరాయం కలిగింది. కాగా, ఆస్పత్రిలో మూడు ఏజెన్సీలకు చెందిన మొత్తం 130 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు.
 

మరిన్ని వార్తలు