‘కల్యాణలక్ష్మి’కి దళారులు  

28 Jul, 2018 11:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఐదు వేలు ఇస్తే సులువుగా పనులు

పెళ్లి కానుక పొందాలంటే కొంత ముట్టజెప్పాల్సిందే..

సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసు ఎదుట నిత్యం దందా

సాక్షి, ఆసిఫాబాద్‌ కొమరంభీం : పేదింటి ఆడ బిడ్డ పెళ్లి చేసుకునే సమయంలో ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకంలో దళారుల తాకిడి ఎక్కువైంది. దరఖాస్తు చేసుకునేప్పుడు అందినకాడికి లబ్ధిదా రుల నుంచి దండుకుంటున్నారు. వివిధ సర్టిఫికెట్ల కోసం ఒక్కో దానికి ఓక్కో రేటు ఫిక్స్‌ చేసి  లబ్ధి దారుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నా రు. ఈ పథకానికి దరఖాస్తు విధానం, అవసరమైన సర్టిఫికెట్లు తదితరవన్ని చాలా మందికి తెలియకపోవడంతో దళారులకు వరంగా మారింది.

ఎవరైనా జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్‌ ఆఫీసు వద్ద కల్యాణలక్ష్మి లేదా షాదీముబారక్‌ కోసం వచ్చిందంటే ఆ లబ్ధిదారుల చుట్టు మధ్యవర్తులు చేరి వారికి కావాల్సిన వివరాలు తీసుకుంటూ రంగంలోకి దిగి ఒక్కో సర్టిఫికెట్‌కు ఇంత ఖర్చు అవుతుందని చెప్పి పనులు చేస్తున్నారు. ఎక్కడ తిరిగే ఒపిక లేక లబ్ధిదారుల అవకాశాన్ని క్యాష్‌ చేసుకుంటున్నారు. అయితే ఒక్కోసారి అధికంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని..

జిల్లా కేంద్రంలోని సబ్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసుకు వివి ధ మండలాల నుంచి గ్రామీణులు, నిర క్షరాస్యులు నిత్యం వస్తుంటారు. వీరిలో కల్యాణలక్ష్మి కో సం కనీసం రోజుకు ఐదు నుంచి పది మంది వర కు లబ్ధిదారులు మ్యారేజి సర్టిఫికెట్‌ కోసం వ స్తుంటారు. ఇలా వచ్చిన వారిలో ఎలా దరఖాస్తు చేయాలో.. సర్టిఫికెట్‌ ఎలా పొందాలో చాలా మం దికి తెలియదు. దీంతో ఇలా అమాయకంగా కని పించే వారి వద్దకు మధ్యవర్తులు వెళ్లి అన్ని పనులు మేం చేసి పెడతాం.. దానికి కొంత ఖర్చు అవుతుందని చెబుతూ రంగంలోకి దిగుతున్నారు.

ఉదాహరణకు కల్యాణలక్ష్మికి పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుల వయస్సు నిర్ధారణ తప్పనిసరి. దీనికి ఆ ధార్‌కార్డు లేదా చదువుకున్న వాళ్లకు పదో తరగతి మార్కుల మెమోను ఆధారంగా  తీసుకుంటున్నారు. చదువుకోని వాళ్లకు వయస్సు నిర్ధారణ సర్టిఫికెట్‌ జత చేయాల్సి ఉంటుంది. ఇందుకు సివిల్‌సర్జన్‌ స్థాయి డాక్టర్‌తో వయస్సు నిర్ధారణ సర్టిఫికెట్‌ తీసుకురావాలి. ఈ సర్టిఫికెట్లు పొందేందుకు నేరుగా లబ్ధిదారులు అధికారుల వద్దకు వెళ్తే పనులు కావడం లేదు.

అదే దళారుల ద్వారా చాలా సులువుగా అయిపోతోంది. ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.200 వరకు వీరి నుంచి వసూలు చేస్తూ డాక్టర్ల నుంచి సర్టిఫికెట్‌ తీసుకొస్తున్నారు. మరో కీలక మైనది ఫస్ట్‌ మ్యారేజి సర్టిఫికెట్‌. ఇది లబ్ధిదారులు నేరుగా సబ్‌రిస్ట్రేషన్‌ ఆఫీసుకు దరఖాస్తు చేసి పంపిస్తే అధికారులు ఆ దరఖాస్తును అక్కడే నిలిపి వేస్తున్నారు. అదే మధ్యవర్తుల ద్వారా ఆఫీసుకు దరఖాస్తు వెళ్తే క్షణాల్లో సంతకం పెట్టి దరఖాస్తును ఆమోదిస్తున్నారు.

దీంతో చదువుకున్న వారు సైతం మధ్యవర్తులను ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ మ్యారేజి సర్టిఫికెట్‌ ప్రభుత్వ ఫీజు రూ.220 వరకు ఉంటే లబ్ధిదారుల నుంచి దళారులు రూ.2 నుంచి 3వేల వరకు గుంజుతున్నారు. గెజిటెడ్‌ సంతకాలు, లాయర్లతో అఫిడవిట్‌ ఫాంలు, ఆధార్‌కార్డులో వయస్సు, ఇంటిపేరు తప్పులు, కుల, ఆదాయ, పెళ్లి కూతురి తల్లి బ్యాంకు అకౌంట్‌ వివరాలు తదితర వన్ని ఒక్కో సర్టిఫికెట్‌ ఒక్కో రేటు చొప్పున మొత్తంగా పెళ్లి కానుకు అందుకోవాలంటే కనీసం రూ.5వేల వరకు ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితి.

ఈ దళారులు సంపాదించే వాటాలో అధికారులకు కూడా వాటా ఉండడంతో వాళ్లు కూడా వచ్చే సంపాదన కాదనక లేకపోతున్నారు. ‘ఎక్కడ ఏ సర్టిఫికెట్‌ దొరుకుతుందో ఖచ్చితంగా తెలియక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక వేళా తెలిసినా.. సంబంధిత ఆఫీసుల చుట్టు తిరగలేక విసిగిపోతున్నారు. దీంతో మధ్యవర్తులకు ఎంతో కొంత ముట్టచెబుతూ పనులు చేసుకుంటున్నారని’ రెవెన్యూ శాఖలో పని చేసే ఓ అధికారి పేర్కొన్నారు.

అయితే గతంలో ఇంత అధిక మొత్తంలో మధ్యవర్తులు వచ్చేవారు కాదని, గత మార్చిలో ప్రభుత్వం రూ.75 వేల నుంచి పెళ్లి కానుక లక్ష నూట పదహారు రూపాయలకు పెంచడంతో ఈ దళారుల బెడద ఎక్కువ అయిందని చెప్పుకొచ్చాడు. కొంతమంది అధికారులు పూర్తిగా మధ్యవర్తులకు పనులు చేయడంతో లబ్ధిదారులకు తిప్పలు తప్పడం లేదు.

 దళారులను నమ్మొద్దు

లబ్ధిదారులు మ్యారేజి సర్టిఫికెట్‌ కోసం ఎక్కడా అధికంగా డబ్బులు చెల్లించవద్దు. ప్రభుత్వ ఫీజు రూ.210 మాత్రమే చెల్లించాలి. దీనిపై గతంలో ఆఫీసులో సమీపంలో ఓ బోర్డు కూడా ఏర్పాటు చేశాం. లబ్ధిదారులు స్థానికంగా పంచాయతీ ఈవో, మున్సిపాలిటీ కమిషనర్‌లో మ్యారేజి సర్టిఫికెట్‌ పొందితే చాలు. మళ్లీ రిజిస్ట్రేషన్‌ ఆఫీసులో సర్టిఫికెట్‌ అవసరం లేదు. అక్కడ చేసుకోలేని వారు మా వద్దకు రావాలి.

– విజయకాంత్, సబ్‌రిజిస్ట్రార్‌ ఆసిఫాబాద్‌   

మరిన్ని వార్తలు