వలస కార్మికులూ మనుషులే...

20 Jun, 2020 04:54 IST|Sakshi

వారిని జంతువుల్లా చూడొద్దు

హైకోర్టు ఘాటు వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌: వలస కార్మికులూ మనుషులేనని, వాళ్లను జంతువుల కంటే హీనంగా చూడొద్దని, మానవీయకోణంలో స్పందించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇటుక బట్టీ ల్లో పనిచేసే వలస కార్మికులను వారి రాష్ట్రాలకు పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని ఈమేరకు సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇటుక బట్టీ పనుల కోసం వచ్చి లాక్‌డౌన్‌ వల్ల రాష్ట్రం లో పలు చోట్ల ఇరుక్కుపోయిన వలస కార్మి కులు ఇబ్బందులు పడుతున్నారని, వారి ని సొంత రాష్ట్రాలకు పంపేలా ఉత్తర్వులు ఇవ్వాలని దాఖలైన మూడు వేర్వేరు ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, బిహార్‌ వంటి రాష్ట్రాలకు పంపేందుకు ప్రత్యే క రైళ్లను ఏర్పాటు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. రైలును ప్రత్యేకంగా నడపాలంటే పది లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, అదే సాధారణ రైలుకు నాలుగు బోగీలను వలస కార్మికులకు కేటాయిస్తే ప్రభుత్వానికి భారం తగ్గేదని కోర్టు అభిప్రాయపడింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వసుధా నాగరాజ్‌ వాదనలు వినిపిస్తూ, బిహార్, ఛత్తీస్‌గఢ్‌లకు రోజు కు 30 చొప్పున ప్రభుత్వం టికెట్లను కొనుగోలు చేస్తోందని, శ్రామిక్‌ రైళ్లను నడిపితేనే వలస కార్మికుల సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. సాంఘిక, కార్మిక, రైల్వే శాఖల అధికారులు వసతి ప్రాంతాలను పరి శీలించి నివేదిక అందజేయాలని ఆదేశించింది. వలస కార్మికులు ఉన్నంత కాలం వారి బాగోగులు ప్రభుత్వమే చూడాలని స్పష్టం చేస్తూ విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. 

మరిన్ని వార్తలు