కడుపు నింపుకో 'తల్లీ'..

1 May, 2020 11:31 IST|Sakshi

సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి: అమ్మ ఆకలి తీరితేనే ఆ చంటిబిడ్డ కడుపు నిండేది.. లాక్‌డౌన్‌తో సొంతూళ్ల బాట పట్టిన వలస కార్మికులకు కండుపు నిండా తిండి దొరకడం లేదు. దాతలు పెట్టే అన్నంతో ఆకలి తీర్చుకుంటూ ఇళ్లు చేరాలనే ఆతృతతో వందల కిలోమీటర్లు నడుస్తున్నారు. గురువారం పెద్దపల్లి బస్టాండ్‌ వద్ద ఆగిన కొంతమందికి నర్సింగ్‌ సేన భోజనం పెట్టి ఆకలి తీర్చింది.  ఓ తల్లి తను భోజనం చేస్తూనే తన బిడ్డకు ఇలా పాలుపట్టింది. మళ్లీ ఇక్కడి నుంచి బయల్దేరితే ఎక్కడ ఆగాలో.. ఎప్పుడు దాతలు తారస పడతారో వారికీ తెలియదు.(‘రామ’సక్కని సూరీడు!)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు