ఊరెళ్తామని 696 మంది దరఖాస్తు

3 May, 2020 08:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ ‌: కేంద్ర హోం శాఖ అనుమతి నేపథ్యంలో స్వగ్రామాలకు వెళ్లేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు నేరేడ్‌మెట్‌ ఠాణాతో పాటు తహసీల్దార్‌ కార్యాలయానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. శనివారం ఉదయమే వివిధ రంగాల్లో పని చేస్తున్న డివిజన్‌ పరిధిలోని వలస కార్మికులు, కూలీలు పోలీసుస్టేషన్, తహసీల్దార్‌ కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. దీంతో నేరేడ్‌మెట్‌ సీఐ నర్సింహా్మస్వామి, తహసీల్దార్‌ గీత పర్యవేక్షణలో పోలీసులు కార్మికులతో మాట్లాడారు. తమ సొంత ఊళ్లకు వెళతామని, ఇందుకు ఏర్పాట్లు చేయాలని విన్నవించారు. ఆధార్‌కార్డు, ఫోన్‌ నంబర్లతోపాటు పూర్తి వివరాలతో వలస కారి్మకులకు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్, ఓడిశా రాష్ట్రాల్లోని సొంత గ్రామాలకు వెళ్లేందుకు 696మంది వలస కారి్మకులు దరఖాస్తు చేసుకున్నారని తహసీల్దార్‌ గీత ‘సాక్షి’తో చెప్పారు. ఉన్నతాధికారుల అనుమతితో కారి్మకులను వారి సొంత గ్రామాలకు తరలించనున్నట్లు తహసీల్దార్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు