‘లోక కల్యాణార్థం కోసమే యాగాలు’

15 Dec, 2019 14:44 IST|Sakshi

దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

సాక్షి, హన్మకొండ: సీఎం కేసీఆర్‌ చేసిన యాగంతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని..  వర్షాలు సమృద్ధిగా కురవడంతో కుంటలు, చెరువులు వాగులు నిండాయని దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని హయాగ్రీవాచారి మైదానంలో ఆదివారం ప్రారంభమైన అతిరుద్రయాగంలో ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో కోటిన్నర ఎకరాల మాగానికి సాగునీళ్లు అందిస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ స్ఫూర్తితో ఇలాంటి యాగాలు జరగడం లోక కల్యాణానికి దోహదపడతాయన్నారు. మేడారం జాతరకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వడం లేదన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆధ్వర్యంలో కేంద్రమంత్రులను కలిశామని చెప్పారు. మేడారం పనులు చురుగ్గా సాగుతున్నాయని వెల్లడించారు. రెండు జాతరలు నిర్వహించిన స్ఫూర్తితో ఈ సారి కూడా మేడారం జాతర వైభవంగా నిర్వహిస్తామని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు